Advertisement
Google Ads BL

'మా' వివాదాలపై మెగాస్టార్ పంచాయితీ!


ఎప్పుడూ లేనిది 'మా' విషయంలో ఈ మధ్యన కొన్ని సెన్సేషన్ న్యూస్ లు బయటికొస్తున్నాయి. నిన్నటికి నిన్న శ్రీ రెడ్డికి 'మా' లో సభ్యత్వం ఇవ్వనంటే ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేసి మరీ 'మా' మెడలు వంచింది. ఇక 'మా' అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఉన్నంత కాలం చిన్న గొడవ కూడా బయటికి రాలేదు కానీ... ఇప్పుడు శివాజి రాజా వచ్చాక మాత్రం 'మా' విషయంలో అనేక రకాల వార్తలు మీడియాలో వినబడుతున్నాయి. శ్రీ రెడ్డి మ్యాటర్ అప్పుడు 'మా' తీసుకున్న నిర్ణయాల మీద విమర్శలు వెల్లువెత్తితే .. ఇప్పుడు ఏకంగా 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మీద 'మా' సెక్రటరీ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. 'మా' లో నిధులు గోల్ మాల్ జరిగాయని బహిరంగంగా సీనియర్ నరేష్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం.. అలాంటిదేం లేదని శివాజీ రాజా, శ్రీకాంత్ మిగతా సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం.. చివరికి ఈ పంచాయితీలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఉండడం...తో ఈ 'మా' విషయం ఇప్పుడు రసవత్తరంగా మారడమే కాదు.. ఈ పంచాయితి చిరు దగ్గరికి ఇరువర్గాలు తీసుకెళ్లడం కూడా ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

‘మా’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిధుల గోల్‌మాల్ విషయంలో మెగాస్టార్ అమెరికాకు హాజరైనప్పుడు రెండు కోట్లొస్తే శివాజీ రాజా మాత్రం ఒక కోటిని మెన్షన్ చెయ్యడంపై తలెత్తిన వివాదం ముగిసేలా కనబడడం లేదు. అయితే ఈ వివాదంలో చిరంజీవి పేరు రావడంపై చిరు కాస్త 'మా' మీద గుస్సా అవుతున్నారని.... నా పేరును ఎందుకు లాగుతున్నారంటూ చిరంజీవి హైరానా పడినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇక నరేష్ మాత్రం ఈ సమస్యను మీరు మత్రమే పరిష్కరించగలరని చిరుతో మొరపెట్టుకోగా... చిరు ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ వివాదానికి ఒక ముగింపు పలుకుతామని మాటిచ్చినట్లుగా చెబుతున్నారు.

అయితే టాలీవుడ్ కి వెన్నుముఖలాంటి 'మా' విషయంలో మెగాస్టార్ చిరు టాలీవుడ్ పెద్దగా ఎలాంటి స్టెప్ తీసుకుని.. ఈ వివాదాన్ని ఎలా కొలిక్కి తెస్తారో గాని.. 'మా' లో భగ్గుమన్న ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో కానీ.. ప్రస్తుతం 'మా' విషయంలో మాత్రం మీడియాకి కావాల్సినంత మేత దొరికింది.

Chiranjeevi Step on Maa allegations:

How to Chiranjeevi Handle this Maa Allegations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs