Advertisement
Google Ads BL

@నర్తనశాల ఆఫీస్‌‌ని రౌండప్ చేశారు


నాగ శౌర్య ‘ఛలో’ సినిమాతో ఫుల్ ఫామ్ లోకొచ్చేసాడు. ఆ తర్వాత రెండు సినిమాలు ఆడకపోయినా నాగ శౌర్య నటించిన @నర్తనశాల సినిమా మీద ట్రేడ్ లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ @నర్తనశాల సినిమా ప్రేక్షకుల, ట్రేడ్ అంచనాలని అందుకోలేకపోయింది. ఛలో సినిమా హిట్ ని చూపించి @నర్తనశాల సినిమాని మంచి లాభాలకే అమ్మేశారు @నర్తనశాల నిర్మాతలు. ఛలో సినిమాని ఓన్ బ్యానర్ లోనే చేసిన నాగ శౌర్య @నర్తనశాలను ఓన్ బ్యానర్ లోనే చేసాడు. అయితే నాగ శౌర్య కి @నర్తనశాల మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే సినిమా ప్లాప్ అయ్యిందనే టాక్ మాత్రం బలంగా వినబడుతుంది.

Advertisement
CJ Advs

అయితే @నర్తనశాల టైటిల్ తో పాటుగా... నాగ శౌర్య మీదున్న నమ్మకం, @నర్తనశాల ప్రమోషన్స్, ఫ‌న్ ఫీస్ట్ మూవీ గా ట్రైలర్ అండ్ టీజర్ కనబడడంతో ఈ సినిమా హిట్ పక్కా అనుకున్నారు. అందుకే మంచిగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి ఛలో సినిమా కన్నా ఎక్కువ లాభాలను ఐరా క్రియేషన్స్ వారికి తెచ్చిపెట్టింది. పాపం ఐరా క్రియేషన్స్ నమ్మకం, నాగ శౌర్య ఓవర్ కాన్ఫిడెన్స్, ట్రేడ్ అంచనా, ప్రేక్షకుల నమ్మకంని.. @నర్తనశాల నిలబెట్టుకోలేకపోయింది. సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ పడడం అలా ఉంచి క్రిటిక్స్ కూడా @నర్తనశాల సినిమాని చీల్చి చెండాడారు. దాంతో ఓవరాల్ గా @నర్తనశాల డిజాస్టర్ టాక్ తో భారీ డిజాస్టర్ గా మిగిలింది.

ఇక నాగ శౌర్య గత సినిమా అమ్మగారిల్లు సినిమా టాక్ బావున్నా కలెక్షన్స్ బాగోలేదు. ఆ సినిమాకొచ్చిన వసూలు కన్నా @నర్తనశాల వసూళ్లు దారుణంగా వున్నాయంటే @నర్తనశాల ఏ మేరకు డిజాస్టర్ అయ్యిందో ఈజీగా అర్ధమవుతుంది. ఇక సినిమా డిజాస్టర్ అవడంతో... @నర్తనశాలను కొన్న బయ్యర్లంతా ఛలో @నర్తనశాల ఆఫీస్ అంటున్నారట. ఐరా క్రియేషన్స్ పై బయ్యర్ల ఒత్తిడి స్టార్ట్ అయ్యిందనే టాక్ నడుస్తుంది. సినిమాని త‌క్కువ‌లో తీసి ఎక్కువ రేట్లకు అమ్మారు.. మా డ‌బ్బులు మాకు సెటిల్ చేయండి అని గోల గోల చేస్తున్నారట. మరి వారు గనక బయ్యర్లకు సెటిల్మెంట్ చెయ్యకపోతే వారంతా కలిసి ఫిలిం ఛాంబర్ సాక్షిగా గొడవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట. మరి ఛలోని చూపించి @నర్తనశాలకు లాభాలు మూటగట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు బయ్యర్లు చుక్కలు చూపిస్తున్నారన్నమాట.

Buyers Fight For @Narthanasala :

Buyers Roundeped @Narthanasala office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs