Advertisement
Google Ads BL

బాలీవుడ్‌ బాద్‌షా అసలు విషయం చెప్పేశాడు


తెలుగులో పెద్దగా హిందువులకు తప్ప ఇతర హీరోలకు డిమాండ్‌ ఉండదు. తెలుగులో ఇలా ఇతర మతస్తులకు పెద్దగా క్రేజ్‌ ఉండదని భావించే తమిళ నటుడైన రెహ్మాన్‌ తెలుగులో తన పేరును రఘుగా మార్చుకున్నాడు. ఇక నాగూర్‌బాబు వంటి సింగర్స్‌ కూడా తెలుగులోకి వచ్చేసరికి మనో అని, ఉదయభాను అని ఇలా ఎందరో పేర్లు మార్చుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు కొదువ లేదు. కానీ బాలీవుడ్‌లో అలా కాదు. అక్కడ కూడా కొందరు ముస్లిం హీరోలు గతంలో దిలీప్‌కుమార్‌ అని ఇతరత్రా పేరు మార్చుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ ఇప్పడు మాత్రం బాలీవుడ్‌ స్టార్స్‌ ముగ్గురు ఖాన్‌లే కావడం విశేషం. 

Advertisement
CJ Advs

ఇక వీరి మద్య కెరీర్‌ పరంగా పోటీ ఉన్నప్పటికీ వీరు ముగ్గురు ఒకటే. ముగ్గురికి దేశంలో అసహనమే కనిపిస్తుంది. ముగ్గురు ఒకరినొకరు సాయం చేసుకుంటూ, అవకాశం వస్తే ఇతరులతో కలిసి కూడా నటిస్తూ ఉంటారు. ఇక షారుఖ్‌ఖాన్‌ విషయానికి వస్తే ఆయన బుల్లితెర సీరియల్‌ ‘సర్కస్‌’వంటి వాటిల్లో నటించి బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. ఈయన తాజాగా సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌ చేస్తోన్న ‘దస్‌ కా ధమ్‌’ ఫైనల్స్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా షారుఖ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

తాను ముంబైకి వచ్చినప్పుడు నటునిగా ఎన్నో కష్టాలు పడ్డానని, ఆసమయంలో తనకు సల్మాన్‌ఖాన్‌ ఇంట్లో భోజనం కూడా పెట్టారని చెప్పుకొచ్చాడు. సల్మాన్‌ తండ్రి సలీంఖాన్‌ తనని ఎంతో ప్రోత్సహించాడని, నటునిగా మంచి స్థాయికి వెళతావని చెప్పి, ఎంతో ఆత్మవిశ్వాసం నింపాడని ఆయన చెప్పుకొచ్చాడు. కేవలం సల్మాన్‌ కుటుంబం వల్లనే తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని, దీనికి సల్మాన్‌ కుటుంబమే కారణమని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ బాలీవుడ్‌ బాద్‌షా మాట్లాడుతూ, కేవలం సల్మాన్‌ఖాన్‌ ఆహ్వానించడం వల్లనే ఈ షోకి చీఫ్‌గెస్ట్‌గా వచ్చానని, సల్మాన్‌ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తానని నవ్వుతూ చెప్పాడు. మొత్తానికి బాలీవుడ్‌ కండలవీరుడు.. బాలీవుడ్‌ బాద్‌షాకి ఎంతో సాయం చేసిన విషయం ఇప్పుడు అందరిలో హాట్‌టాపిక్‌గా మారింది. 

Shahrukh Khan Speech at Dus Ka Dum 3 Finale:

Makers of Salman Khan’s Dus Ka Dum 3 had reportedly asked Shah Rukh Khan to come in as a guest for the finale episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs