Advertisement
Google Ads BL

హాలీవుడ్ రేంజ్‌కి.. ‘ప్రేమకు రెయిన్ చెక్’


‘రెయిన్ చెక్’ అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్  పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా హీరో అభిలాష్ మాట్లాడుతూ.. “నా తొలి సినిమా.‌ మా టీమ్‌కు ఈ సినిమా ఒక డ్రీమ్.  మా వర్క్ ఎంటనేది ఇప్పటికే ట్రైలర్ లో చూశారు. మా టీమ్ అందరం దిబెస్ట్ అవుట్‌పుట్ వచ్చేలా ‘ప్రేమకు రెయిన్ చెక్’ కు  వర్క్ చేశాం. కార్పొరేట్ లవ్ స్టొరీ ఎవ్వరిని డిజప్పాయింట్ చేయదు. మా వర్క్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము..’’ అన్నారు.

హీరోయిన్స్ ప్రియా, మౌనిక  మాట్లాడుతూ.. “దర్శకులు ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా ఈ సినిమా చేశారు. సినిమాలో ప్రతి పాత్ర బ్యూటీఫుల్ గా ఉంటాయి.  సినిమా అందరికీ నచ్చుతుంది..’’ అన్నారు. 

సంగీత దర్శకులు దీపక్ కిరణ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం పాటలని ప్రోత్సహించినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు, చిత్రంలో విజువల్స్, కథ, కథనం ప్రకారం ఫ్రెష్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మీ ముందుకు ‘ప్రేమకు రెయిన్ చెక్’ రాబోతుంది. మీ అందరి మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాము” అని తెలిపారు.

ఆకెళ్ల పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఎడ్వెంచర్ స్పోర్ట్స్ ఆఫీస్ నేపధ్యంలో నడిచే సినిమా ఇది. లవ్, అడ్వెంచర్, పెయిన్, ఫన్ ఇలా అన్నీ అంశాలు ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి. రియల్ గా అడ్వెంచర్ మా నటీనటులు చేయటం విశేషం. ఈ చిత్రంలో కథా కథనంతో పాటు ముఖ్యంగా ఆకట్టుకునే అంశాలు. లార్జర్ ధెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఓవర్ ఆల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నాము. స్టోన్ మీడియా ఫిల్మ్స్ ఆండీ కోహెన్ మరియు అతని సంస్థ కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాము. మా సినిమా చూసి నచ్చి అంతర్జాతీయ భాషలలో చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి హాలీవుడ్ చిత్రాల సమర్పకులు ఆండీ కొహెన్ ముందుకు వచ్చారు. శరత్ మరార్ గారు మా వర్క్ నచ్చి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నారు. సినిమాకు కంటెంట్ ఇంపార్టెంట్. అలాగే సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మా చిత్రంలో ఈ రెండు ఉంటాయి. టీమ్ వర్క్ మా సినిమాకు ప్రధాన బలం‌. ప్రతి అంశం దిబెస్ట్ అనిపించేలా..  ‘ప్రేమకు రెయిన్ చెక్’ ఉంటుంది...’’ అన్నారు. 

హాలీవుడ్ మరియు అంతర్జాతీయ భాషలలో రాబోతున్న ‘ప్రేమకు రెయిన్ చెక్’

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకో ముఖ్యమైన విషయం, ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్మించాలని హాలీవుడ్ నిర్మాత ఆండీ కోహెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఆండీ కోహెన్ చిత్రం మరియు టెలివిజన్ ఉత్పత్తిలో పాల్గొన్న US ఆధారిత ఉత్పత్తి మరియు కన్సల్టెన్సీ సంస్థ గ్రేడ్ A ఎంటర్టైన్మెంట్ అధ్యక్షుడు. ఆయన  నేతృత్వంలో, స్టోన్ మీడియా ఫిల్మ్స్తో చేతులు కలిపి ప్రపంచవ్యాప్తంగా “ప్రేమకు రెయిన్ చెక్”  ప్రోత్సహించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఆండీ కొహెన్ మాట్లాడుతూ..  “ప్రేమకు రెయిన్ చెక్ యూనివర్సల్ సబ్జెక్ట్. ‘‘ప్రేమకు రెయిన్ చెక్’’ లేదా ‘‘రెయిన్ చెక్ టు లవ్’’ గురించి మనకు చాలామంది ఉత్తేజపరిచే విషయం ఏంటి అంటే ఇది ఈ సార్వత్రిక భావనను తీసుకుని పాత్రలను, వినోదభరితమైన ప్లాట్లతో  మేము ఏ దేశం లేదా సంస్కృతి నుండి ఉన్నా ఆకట్టుకునే కథాంశం. ఈ కథాంశం భారతదేశం లో ఉన్న ప్రేక్షకులకి పరిమితం కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అందచేయ్యాలి అన్నదే మా ఉద్దేశం. చిత్రం తాజాగా మరియు ఆసక్తికరంగా ఉంచే మలుపులతో నిండి ఉంటుంది. ప్రతిభావంతులైన నటీనటులు ఈ చిత్రానికి, వారి పాత్రలకి అనుగుణంగా బాగా చేసారు. ఈ చిత్రం ప్రొడక్షన్  విలువలు హాలీవుడ్ చిత్రాలకి ఏ మాత్రం తీసిపోదు. డైరెక్టర్ శ్రీనివాస్ మొదటి చిత్రం అయినప్పటికీ, తన కథ చెప్పే విధానం చూసాక ఇది ఖచ్చితంగా తన చివరిది కాదని నిరూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అప్పీల్ చేస్తానని భవిష్యత్ ప్రాజెక్టులలో అతనితో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను” అన్నారు.

Premaku Raincheck in Hollywood Range:

Premaku Rainchek movie pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs