Advertisement
Google Ads BL

కౌశల్‌ది స్వీయ తప్పిదమా? బిగ్‌బాస్‌లో కుట్రలు!!


నాని హోస్ట్‌గా మొదలైన బిగ్‌బాస్‌ సీజన్‌2 ముగింపు దశకు వచ్చే సరికి బాగా రసవత్తరంగా మారింది. ఎలిమేషన్స్‌తో పాటు కొందరు పార్టిసిపెంట్స్‌ సేవ్‌ అవుతున్న తీరు కూడా పలు అనుమానాలకు చోటిస్తోంది. ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న కౌశల్‌ మాత్రం ఎందుకో హౌస్‌లోని ప్రతి ఒక్కరికి టార్గెట్‌గా మారాడు. ఆయనకు బిగ్‌బాస్‌ అండ, ప్రేక్షకుల నుంచి మద్దతు బాగానే ఉన్నా కూడా తన తోటి పార్టిసిపెంట్స్‌ని మెప్పించడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. అందరినీ మెప్పించాల్సిన పని లేకపోయినా హౌస్‌లోని అందరు ఆయనను ఏకాకి చేయడం చూస్తుంటే ఈయన వ్యవహారశైలిపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

అందరినీ మెప్పించలేకపోయినా అందరూ దూరంగా పెడుతుండటం వల్ల అది ఆయన స్వీయతప్పిదమా? ఆయన వ్యవహారశైలిని మిగిలిన వారు ఎందుకు ద్వేషిస్తున్నారు? అందరు ఆయననే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? వంటి పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా హౌస్‌మేట్స్‌ అందరు ఆయనపై ఏకతాటిపై నిలబడుతున్నారు. అందరు ఒకటై కౌశల్‌ని దూరంగా పెడుతుండటంతో కౌశల్‌ గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ షో మొదటి నుంచి విజేత కౌశల్‌ అనే వార్తలు గుప్పుమనడంలో కూడా ఏదైనా మతలబు ఉందా? అనేది అర్ధం కాని పరిస్థితి. తాజాగా కూడా ఆయనపై అందరు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ముందు ఒకలా, ఆయన వెనుక మరోలా మాట్లాడుతూ కౌశల్‌లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ వారం నలుగురు సభ్యులు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. 

ఇప్పటికే హౌస్‌లో సెలబ్రిటీలు తప్ప సామాన్యులు లేకపోవడం గమనార్హం. ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది సామ్రాట్‌కి అండగా నిలవడంతో ఆయన ఎలిమినేషన్‌ నుంచి బయటపడ్డాడు. శ్యామల, అమిత్‌, దీప్తి, కౌశల్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. కాగా గతవారం బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌లో విజయం సాధించిన గీతామాధురి ఏకంగా కౌశల్‌ని ఈ సీజన్‌ మొత్తానికి ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేసింది. ఈ తీరు చూస్తుంటే కౌశల్‌ విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కౌశల్‌ విజేతగా నిలిచే అవకాశాలు మృగ్యంగా మారడం విశేషం. 

Doubts on Kaushal Victory in Bigg Boss 2:

Bigg Boss 2 Totally Changed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs