Advertisement
Google Ads BL

గోవిందుడు లెక్కలు తేలుస్తున్నాడు


విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఆ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. మొదటి వారం ఈ సినిమా ఏకంగా 40 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి వారం అంటే రెండో వారంలో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా అవి ఏ మాత్రం ఈ సినిమా జోరును ఆపలేకపోయాయి. వాటి ప్రభావం ఏ మాత్రం ఈ సినిమాపై పడలేదు. దాంతో రెండో వారంలో కూడా  ‘గీత గోవిందం’ బాక్సాఫీస్ లీడర్ గా నిలిచింది.

Advertisement
CJ Advs

ఇక ఈ వారం అంటే మూడో వారంలో నాగశౌర్య నటించిన ‘@నర్తనశాల’ పై చాలా ఆశలు పెట్టుకున్నారు అంతా. అలానే అల్లు అరవింద్ ‘పేపర్ బాయ్’ సినిమాను రిలీజ్ చేశారు. వీటితో పాటు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన  ‘కోకో కోకిల’ సినిమా మంచి టాక్ తో రిలీజ్ అయింది. దాంతో ఈ మూడు సినిమాలు ‘గీత గోవిందం’కు అడ్డు కట్ట వేస్తాయి అని భావించారు ట్రేడ్ వర్గాలు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

‘@నర్తనశాల’ సినిమాకు సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. దాంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ‘పేపర్ బాయ్’ పర్లేదు అనిపించుకున్నా ఆ సినిమా ప్రభావం ‘గీత గోవిందం’పై పడకుండా అరవింద్ అండ్ టీమ్ ప్లాన్ చేశారు. ‘కోకో కోకిల’ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ట్రేడ్ లెక్కలు ప్రకారం శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘గీత గోవిందం’ రూ.93 వేల దాకా వసూళ్లు వస్తే.. ‘@నర్తనశాల’కి రూ.13 వేల పైచిలుకు గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక ‘పేపర్ బాయ్’ రూ.22 వేలు, ‘కోకో కోకిల’ రూ.18 వేలు తెచ్చుకున్నాయి. ఈ మూడు సినిమాలు కలెక్షన్స్ కలుపుకున్న ‘గీత గోవిందం’  మొత్తం వసూళ్లలో 60 శాతమే ఉన్నాయి. సో దీనిని బట్టి చూస్తుంటే గోవిందుడు ప్రభావం టాలీవుడ్ పై ఏ మాత్రం పడిందో అర్ధం అవుతుంది.

No Change in Geetha Govindam Collections:

Geetha Govindam Strong Film to Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs