Advertisement
Google Ads BL

‘సైరా’.. విజయ్ సేతుపతి అప్‌డేట్


చిరంజీవి 151వ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఇండియాకి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ తో పాటు కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉంటాదో అన్న న్యూస్ మాత్రం బయిటికి రాలేదు. కానీ లేటెస్ట్ గా విజయ్ పాత్రకు సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చింది.

Advertisement
CJ Advs

విజయ్ సేతుపతి.. సైరాలో తమిళుడి పాత్రలో నటించనున్నాడట. విజయ్ ఇందులో చిరుకి కుడి భుజంగా ఉంటూ బ్రిటీష్ వారితో పోరాడుతాడట. ఇది తమిళుడి పాత్ర కాబట్టి యూనిట్ మొత్తం విజయ్ కె వోట్ వేసిందని సమాచారం. ప్రస్తుతం విజయ్ కోలీవుడ్‌లో మోస్ట్ బిజీ. అతని నటనకు తెలుగులో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అతను అయితే మన తెలుగు వాళ్లు కూడా యాక్సప్ట్ చేస్తారని ఆయన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో విజయ్ తన పాత్ర నచ్చి ఏమి ఆలోచించకుండా సైన్ చేశాడట. చిరంజీవి, విజయ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.ఇతనికి సంబంధించి ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయనున్నారు యూనిట్. మరి విజయ్ పాత్ర ఇందులో ఎలా ఉంటాదో చూడాలంటే 2019 సమ్మర్ వరకు ఆగాల్సిందే.

Sye Raa Vijay Sethupathi Update:

Vijay Sethupathi Key Role in Sye Raa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs