Advertisement
Google Ads BL

ట్రోలింగ్‌కి గట్టి సమాధానమే ఇచ్చింది..!


సినిమా రంగం అందునా హీరోయిన్లు అంటే ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా చెప్పుకోవాలి. సినీ నటులు ఎలాంటి స్టైల్‌ని ఫాలో అవుతారో ప్రజలు కూడా అలాగే కనిపించాలని తపన పడతారు. అయితే కొందరు వేసే కొత్త ఫ్యాషన్స్‌ మొదట్లో ఏంటి? ఇలా ఉంది? అనిపించినా కూడా సినిమా విడుదలై మంచి విజయం సాధించిందంటే అందరు వారి రూట్‌నే ఫాలో కా కతప్పదు. ఇక విషయానికి వస్తే తాజాగా బాలీవుడ్‌ నటి పరిణితీ చోప్రా కొత్త తరహా హెయిర్‌స్టైల్‌తో దర్శనమిస్తోంది. ఈమె హెయిర్‌స్టైల్‌ని చూసిన పలువురు ఈమెని ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఏంటా హెయిర్‌స్టైల్‌.. పిశాచిలా.. దెయ్యంలా కనిపిస్తున్నావు. అసలు ఎవరైనా జుట్టుకి ఎరుపు రంగు వేసుకుంటారా? అని పలువురు నెటిజన్లు పరిణితీని ఆటపట్టిస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే పరిణితి మాత్రం 'పరిణిత చెందిన దానిలో అది ఎరుపు రంగు అని ఎవరు చెప్పారు? అది బర్గండి' అంటూ సమాధానం చెబుతోంది. 'నమస్తే ఇంగ్లాండ్‌' చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పరిణితీ తన తదుపరి చిత్రం 'జబరియాజోడీ' కోసం ఈ హెయిర్‌ స్టైల్‌లోకి మారింది. ఆ సినిమా నిర్మాత రుచికా కపూర్‌ సలహా మేరకు పరిణితి బర్గండి కలర్‌తో హెయిర్‌ డ్రై వేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. 

దానికి పరిణితి సమాధానం ఇస్తూ, ఇదివరకు ఎప్పుడు ప్రయత్నించని పని చేయాలని అనుకున్నాను. సినిమా నిర్మాత రుచికా సలహా మేరకు ఇలా ట్రెండీగా మారాను. ఇలాంటివి మెయిన్‌ టెయిన్‌ చేయాలంటే సహనం ఉండాలి. ఈ స్టైల్‌లోకి మారిన తర్వాత నాకు బాగా సహనం వచ్చేసింది.. అంటూ సమాధానం ఇచ్చింది. అయినా ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేయడం పరిణితీకి కొత్తేం కాదు కదా.

Parineeti Chopra throws shade at trolls in new pic:

Parineeti Chopra Reacts to Ruthless Comments on Her New Hair
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs