Advertisement
Google Ads BL

మహేష్‌ కేక పుట్టిస్తున్నాడు..!


దేశంలోనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి ఎంతో క్రేజ్‌ ఉంది. థమ్సప్‌ నుంచి ఎన్నో బ్రాండ్లు ఆయన చేతిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహేష్‌ తన ప్రతిష్టాత్మకమైన 25 వ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఇందులో జయసుధ, ప్రకాష్‌రాజ్‌లు మహేష్‌ తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఇప్పటికే ‘మహర్షి’ అనే టైటిల్‌తో పాటు చిన్న గడ్డం, మీసాలతో నిరుద్యోగి గెటప్‌లో ఫైల్స్‌ పట్టుకుని నడుస్తున్న మహేష్‌బాబు లుక్‌ చూసి అయన అభిమానుల నుంచే కాదు.. అందరి నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ లుక్‌లో మహేష్‌ రఫ్‌గా కనిపిస్తూనే తనదైన కూల్‌ లుక్స్‌తో కేకపుట్టిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్‌కి, ఫస్ట్‌లుక్స్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అయితే మహేష్‌ తన అభిమానులకు ‘మహర్షి’ విడుదలయ్యే లోపలే మరో గిఫ్ట్‌ ఇస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఆయన క్లోజప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ మరో మోడల్‌తో కలిసి ఓ పాటలో నృత్యం చేస్తున్నాడు. క్లోజప్ ఫేమస్‌ సాంగ్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటే మహేష్‌ ఎర్రజాకెట్‌ని ధరించి నిజమైన ఎర్ర క్లోజప్‌ని గుర్తుకు తెస్తూ ‘దగ్గరకు రా.. దగ్గరకు రా.. దగ్గరకు రావా’ అంటూ చిందులేస్తూ కనిపిస్తున్న రెండు నిమిషాల వీడియో ఇప్పుడు మహేష్‌ అభిమానుల పుణ్యమా అని వైరల్‌ అవుతోంది. బహుశా ఈ యాడ్‌ తెరపైకి వచ్చే సరికి కేవలం కొన్ని సెకన్లే ఉండే అవకాశం ఉంది. కానీ పూర్తి సాంగ్‌ వీడియో రూపంలో బయటకు రావడంతో మహేష్‌ అభిమానుల అనందానికి అవధులు లేవనే చెప్పాలి. మొత్తానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా తనకు తిరుగేలేదని మరోసారి మహేష్‌ నిరూపిస్తున్నాడనే చెప్పాలి. 

Click Here For Full Song

Mahesh Babu Close Up Ad Song Sensation in Social Media:

Mahesh Babu Close Up Ad Song released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs