Advertisement
Google Ads BL

నందమూరి హరికృష్ణ ఇంటికివెళ్లిన మహేష్‌


నిజానికి అంతా మంచి జరిగి ఉంటే ఈరోజు నందమూరి హరికృష్ణ తన 62వ జన్మదినోత్సవం జరుపుకునేవాడు. కానీ ఆయన హఠాన్మరణం ముందే ఈ ఏడాది తాను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని, అభిమానులెవ్వరూ తన జన్మదినాన్ని జరుపుకోవద్దని సూచించాడు. పూలమాలలతో ఇతరత్రా తనను కలవద్దని, కేరళతో పాటు ఉభయగోదావరి జిల్లాలలో ఏర్పడిన వరద భీభత్సం కారణంగా తాను బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం లేదని, అభిమానులు కూడా తన బర్త్‌డే వేడుకలకు ఖర్చు చేసే మొత్తాన్ని వరద బాధితులకు అందజేయాలని కోరారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే హరికృష్ణ మరణం సంభవించిన వెంటనే మహేష్‌ స్పందించి ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌లకు మనో దైర్యాన్ని ఇవ్వాలని తాను దేవుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపాడు. తాజాగా ఆయన మెహిదీపట్నంలోని హరికృష్ణకి ఇష్టమైన ఇంటికి వెళ్లి గంటసేపు నందమూరి కుటుంబసభ్యులతో గడిపాడు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపి, వారిని ఓదార్చారు. బుధవారం హరికృష్ణ నెల్లూరు జిల్లాలోని కావలిలో ఉన్న తన అభిమాని కుమారుడి వివాహానికి కారులో వెళ్తూ తీవ్ర దుర్ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే. 

ఆయనకు అసలు సీట్‌బెల్ట్‌ పెట్టుకునే అలవాటే లేదని, ఆయన కారునైనా భారీ వాహనాలలైనా నడపడంతో ఎంతో చాతుర్యం చూపించేవారని వైవిఎస్‌ చౌదరి చెప్పిన మాట వింటుంటే కేవలం సీటు బెల్ట్‌ పెట్టుకునే అలవాటు లేకపోవడం, ఓవర్‌స్పీడ్‌ వంటివే ఆయన మరణానికి కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తూ సీటుబెల్ట్‌ పెట్టుకున్నమరో ఇద్దరు మాత్రం గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. 

Mahesh Babu meets Nandamuri Family:

Mahesh Babu Meet Entire Harikrishna family 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs