Advertisement
Google Ads BL

సైరాలో ఈ సస్పెన్స్ ఏంటి?


రామ్ చరణ్ నిర్మాతగా... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం సై రా నరసింహారెడ్డి. ఈ చిత్రం ఇండియా వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఇండియాలోని పలుభాషల్లో విడుదల చేసే ఏర్పాట్లను చరణ్ ఎప్పుడో మొదలెట్టాడు. అందుకే అన్ని భాషలలో సై రా నరసింహారెడ్డికి హైప్ తీసుకురావడానికి ఆయా భాషల్లోని టాప్ నటీనటులను సై రా కోసమే ఎంపిక చేశారు. సై రా నరసింహారెడ్డి లో నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి, ఆయన సతీమణిగా నయనతార, ఇంకా తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నుండి అమితాబచ్చన్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, కన్నడ నుండి కిచ్చా సుదీప్ లు నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో తమన్నా కూడా కీలకపాత్రలో నటిస్తుండగా.. ఇప్పుడు బాలీవుడ్ నుండి మరో సీనియర్ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినబడుతుంది. అదికూడా చిరు సరసన అందరివాడులో, నాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, బాలయ్య సరసన చెన్నకేశవరెడ్డి, వెంకటేష్ సరసన కూలి నెంబర్ 1 సినిమాల్తో తెలుగుకి సుపరిచుతురాలైన టబు కూడా సై రా నరసింహారెడ్డిలో నటిస్తుందనే టాక్ వినబడుతుంది. అయితే టబు కోసమే నిర్మాత రామ్ చరణ్ రంగంలోకి దిగినట్లుగా వార్తలొస్తున్నాయి.

మరోపక్క టబు.. సై రా లో నటించే అవకాశం లేదని...కేవలం ఆ వార్త ఒక రూమర్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. మరోపక్క టబు గ్రీన్ సిగ్నల్ కోసం రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి లు వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సినిమా మీద క్రేజ్ రావాలనుంటే ఇలా పలు భాషల్లో పేరున్న నటీ నటులతో అది సాధ్యమవుతుందని అంటున్నారు. ఇక సై రా ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి స్పందనోచ్చింది. ఇక తాజాగా సై రా లో అవుకు రాజు పాత్ర‌లో క‌న్న‌డ అభిన‌య చ‌క్ర‌వ‌ర్తి సుదీప్‌ లుక్ కూడా అందరిని అమితంగా ఆకట్టుకుంటుంది.

One More Actress in Sye Raa?:

Tabu in Sye Raa Narasimha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs