Advertisement
Google Ads BL

మహేష్‌ ఫ్యాన్స్‌ ఎంజాయ్ చేస్తున్నారు..!


'బ్రహ్మూెత్సం, స్పైడర్‌' వంటి డిజాస్టర్స్‌ తర్వాత 'భరత్‌ అనే నేను'తో కలెక్షన్లను మాత్రమే కాదు.. మేథావుల ప్రశంసలను కూడా మహేష్‌బాబు చూరగొన్నాడు. ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు-అశ్వనీదత్‌ల నిర్మాణ భాగస్వామ్యంంలో 'మహర్షి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులోని మహేష్‌ లుక్‌ అద్భుతంగా ఉందని ఆమధ్య విడుదలైన స్టిల్స్‌ని చూస్తేనే బాగా అర్ధమవుతోంది. లైట్‌గా గెడ్డం, మీసాలతో ఉన్న ఆయన లుక్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక టైటిల్‌ కూడా మహేష్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని అందరు భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో మహేష్‌కి తల్లిదండ్రులుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటించిన సహజనటి జయసుధ, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌లు పోషిస్తున్నారు. దిల్‌రాజుకి ఉన్న సెంటిమెంట్‌ ప్రకారం వీరిద్దరు ఉంటే చిత్రం బ్లాక్‌బస్టర్‌ ఖాయం అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక విషయానికి వస్తే మహేష్‌ సినిమాలతో, ఖాళీ సమయాల్లో ఫ్యామిలీ టూర్స్‌తో ఎంత బిజీగా ఉంటాడో వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మహేష్‌ అంతే స్థాయిలో దూసుకుపోతూ బాలీవుడ్‌ హీరోలకు సైతం పోటీనిస్తూ ఉంటాడు. నేషనల్‌ వైడ్‌లో బడా బడా స్టార్స్‌, క్రికెటర్స్‌కి ధీటైన ఫాలోయింగ్‌ వాణిజ్య ప్రకటనల్లో మహేష్‌కి ఉంది. 

తాజాగా ఈ జాబితాలోంచి క్లోజప్ టూత్‌పేస్ట్‌ యాడ్‌ బయటకు వచ్చింది. ఈ యాడ్‌కి సంబంధించి బయటికి వచ్చిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రెెడ్‌ కలర్‌ దుస్తుల్లో మహేష్‌ మిలమిలమెరిసిపోతూ ఉంటే, ఈ యాడ్‌ దాదాపు రెండు నిమిషాలు సాగుతూ ఉండటం విశేషం. క్లోజప్ ఫేమస్‌ సాంగ్‌ బ్యాగ్రౌండ్‌లో వస్తూ ఈ యాడ్‌ టెలివిజన్లలో సెకన్లకు కుదించడం సహజమే అయినా ఈ ఫుల్‌ రెండునిమిషాల సాంగ్‌ మాత్రం మహేష్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంది.

Mahesh Babu Fans Happy with Closeup Ad:

Mahesh Babu's Close up Ad Song Released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs