Advertisement
Google Ads BL

అభిమానులకే అంకితం అంటున్నాడు!


'గీతగోవిందం'... ఈ చిత్రం సాధించిన విజయం గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే అవుతుంది. అల్లుఅరవింద్‌కి బాలీవుడ్‌ 'గజిని' 100కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు స్టార్‌గా ఎదుగుతున్న విజయ్‌ దేవరకొండ హీరోగా కేవలం 10కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'గీతగోవిందం' 50 కోట్ల నుంచి 60కోట్ల షేర్‌ వరకు దూసుకెళ్తూ, 100కోట్ల గ్రాస్‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించగా, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కూడా ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో చేరిన విషయాన్ని అధికారికంగా దృవీకరించాడు. 

Advertisement
CJ Advs

సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం విజయం సాధిస్తుందని అందరు ఊహించారే గానీ ఈ స్థాయి విజయాన్ని మాత్రం మరెవ్వరూ ఊహించలేకపోయారనేది వాస్తవం. తమకు చిత్రం నచ్చితే ప్రేక్షకులు ఏ చిత్రానైనా ఎంతలా ఆదరిస్తారో దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు. అందుకే ఈ 100కోట్ల ఫీట్‌ని ప్రేక్షకులందరికీ విజయ్‌ దేవరకొండ అంకితం చేసేశాడు. నా మొదటి సెంచరీని నా కోచింగ్‌ స్టాఫ్‌ గీతాఆర్ట్స్‌కి, నా కెప్టెన్‌ బుజ్జికి, నాతో లవ్లీ పార్ట్‌నర్‌షిప్‌ అయిన రష్మికకు, అభిమానులకు, ప్రేక్షకులందరికీ అంకితమిస్తున్నానని తెలిపాడు. 

ఇక ఆయన పనిలో పనిగా ప్రేక్షకులందరికీ అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 'గీతగోవిందం' సాధించిన అపురూప విజయాన్ని పురస్కరించుకుని విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం విదేశాలలో రిలాక్స్‌ అవుతున్నాడు. ఆయన విదేశాలలో ఉన్నా కూడా 'గీతగోవిందం' చిత్రం సాధిస్తున్న కలెక్షన్లపై ఆయన ఓ కన్నువేశాడని దీనిని బట్టి స్పష్టంగా అర్ధమవుతోంది. 

Vijay Devarakonda About Geetha Govindam Success:

vijay devarakonda dedicates geetha govindam success to fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs