Advertisement
Google Ads BL

కొడుకు ఎదుగుదల చూస్తే ఏ తండ్రికైనా అంతే!


పిల్లలు చాలా త్వరగా ఎదుగుతూ ఉంటారు. ఇక తమ వారసుల ఎదుగుదల చూస్తే ఏ తండ్రికైనా ఎక్కడలేని ఆనందం వస్తుంది. అప్పుడు పిల్లలు అంత వారైపోయారా? అని ఆశ్చర్యపోతూ ఉంటారు. సూపర్‌స్టార్‌ కృష్ణ తన కెరీర్‌ బిజీలో రోజంతా గడిపేవాడు. దాంతో ఆయన తన కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోయి ఉంటాడు. అందుకేనేమో ఆ లోటు తన సంతానికి ఎదురు కాకూడదని మహేష్‌ భావిస్తూ ఉంటాడు. తన కుటుంబానికి వీలైనంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. 

Advertisement
CJ Advs

ఇక మహేష్‌ కూడా తాను బాలనటునిగా ఉన్న నాటి నుంచే తండ్రి చిత్రాలలో నటించాడు. అలా చూసుకుంటే మహేష్‌ కుమారుడు గౌతమ్‌ కృష్ణ కూడా '1' నేనొక్కడినే చిత్రంతో బాలనటునిగా పరిచయం అయ్యాడు. ఇక తాజాగా గౌతమ్‌కృష్ణ తన 12వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్‌ తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాలం వేగంగా జరిగిపోతోందని, తన కుమారుడు ఇప్పటికే 12 ఏళ్లకు చేరుకున్నాడని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. నా కుమారుడు గౌతమ్‌ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని మహేష్‌ స్పందించాడు.

Mahesh Celebrates Gautham Krishna Bday:

Mahesh Babu in Full Happy Mood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs