Advertisement
Google Ads BL

చంద్రబాబు బయోపిక్ పేరేంటో తెలుసా?


బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది.  తెలుగులో ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో  మహా నాయకులుగా పేరొందిన ఎన్టీఆర్ , చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ల బయోపిక్ లు సైతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇందులో చంద్రబాబు నాయుడు బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా.. దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలోనే ఆయనొక అరుదైన , ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్దానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబుగారి బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నాము. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తిచేశాము. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. భాస్కర్ ఎన్టీఆర్ గా కన్పిస్తారు. చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్ లో చూపిస్తామన్నారు.

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ  సెప్టెంబర్ 1కి 23 సంవత్సరాలవుతోంది. ఈ సందర్బంగా మా చిత్ర ఫస్ట్ లుక్  పోస్టర్ ను విడుదల చేస్తున్నాము. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో  అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్ ను  మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

Chandrababu Biopic 80 Percent Shoot Completed:

Chandrababu Biopic name Chandrodayam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs