Advertisement
Google Ads BL

'మణికర్ణిక’ వెనుక ఏదో జరుగుతోంది?


గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రని కంగనా మెయిన్ లీడ్ లో మణికర్ణికగా సినిమాని తెరకెక్కించాడు. అయితే షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. అయితే దర్హకుడు క్రిష్ మణికర్ణిక షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల సమయంలో కంగనా రనౌత్ తో గొడవ కారణంగా టాలీవుడ్ కి వచ్చేసి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మధ్యన కంగానికి, క్రిష్ కి మధ్యన గొడవంటూ మీడియాలో వార్తలు రావడం.. కంగనా స్వీయ దర్శకత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపించడం... క్లాప్ బోర్డు మీద కంగనా పేరు వేయించుకుని క్రిష్ పేరుని దర్శకుడిగా తప్పించేసింది.

Advertisement
CJ Advs

మధ్యలో నాకు దర్శకుడు క్రిష్ కి గొడవలేం లేవంటూనే క్లాప్ బోర్డు మీద కంగనా పేరు వేయించుకోవడం చూస్తుంటే వారి మధ్యన గొడవలున్నాయని అందరికి అర్ధమవుతుంది. ఇక క్రిష్ మాత్రం మణికర్ణిక విషయంలో ఏం స్పందించడు. ఇక తాజాగా మణికర్ణిక సినిమా నుండి ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోను సూద్ బయటికొచ్చేశాడు. ఈ విషయాన్నీ సోను సూద్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మణికర్ణికలో తాను లేనని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే సోను సూద్ ఇలా బయటికి రావడం వెనుక కంగనాతో గొడవే అంటున్నారు. మణికర్ణిక సెట్ లో కంగనాతో విభేదాలు, అలాగే సెట్ లో సోను సూద్ ని తక్కువ చేసి చూడడంతోనే సోను సూద్ బయటికొచ్చినట్లుగా బి టౌన్ గుసగుసలు.

మరోపక్క సోను సూద్ మణికర్ణిక సినిమాలో నటిస్తూనే రణ్వీర్ సింగ్ శింబ సినిమాలో విలన్ గా నటించడం... మణికర్ణిక సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకోవడంతో.. సోను సూద్ శింబ షూటింగ్ లో జాయిన్ అవడం.. శింబ కోసమా క్లీన్ షేవ్ చెయ్యడం, మణికర్ణిక కోసం గెడ్డం పెంచాల్సి ఉందట. కానీ మణికర్ణిక షూటింగ్ బ్రేక్ పడడంతో.. ఆ గెడ్డం తీసేసి శింబ కోసం సోను వెళ్తానంటే.. మణికర్ణికా టీం ఒప్పుకోకపోవడంతో.. సోను సూద్ ఏకంగా ఆ ప్రాజెక్ప్ట్ నుండి తప్పుకుని.. తన ప్లేస్ లో వేరేవారిని పెట్టుకోమని చెప్పి వచ్చేశాడట. మరి ఇలా సమస్యల సుడిగుండంలో మణికర్ణిక కొట్టుకుపోతుంది. అసలు ఇన్ని సమస్యలు రావడానికి కారణం కంగానాకున్న పొగరు కారణమంటున్నారు.

Sonu Sood walks out of Kangana Ranaut's 'Manikarnika: The Queen of Jhansi':

Kangana Ranaut's Manikarnika Co-Star Sonu Sood Opts Out Of Film. Because, A Beard    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs