Advertisement
Google Ads BL

అలాంటి ఫొటోలతో ఇలా దిగజారుస్తారా: నటి!


ఫేస్‌బుక్‌ విత్‌ కవిత, కుటుంబ్‌, కహాని ఘర్‌ ఘర్‌హై, తుమ్హారీ దిశా, రీమిక్స్‌, సిఐడి, ఎఫ్‌ఐఆర్‌, ఏక్‌ ప్యార్‌సా బంధన్‌, సావధాన్‌ వంటి పలు సీరియళ్లలో నటించి మంచి పేరుతెచ్చుకున్న హిందీ నటి కవిత. ఈమె ‘ఏక్‌ హసీనాథీ, ముంబై కటింగ్‌, ఫిలింసిటీ, జంజీర్‌’ వంటి చిత్రాలలో కూడా నటించింది. రోనిత్‌ బిశ్వాస్‌ని ఆమె వివాహం చేసుకుంది. కవితాకౌశిక్‌ తాజాగా ఫేస్‌బుక్‌పై మండిపడింది. పనికిరాని పనులు చేసేందుకు తప్ప ఫేస్‌బుక్‌ ఎందుకు పనికిరాదని దుమ్మెత్తి పోసింది. 

Advertisement
CJ Advs

ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చిన తన మార్ఫింగ్‌ నగ్న ఫొటోలపై తీవ్రంగా స్పందించిన ఆమె ఫేస్‌బుక్‌ నుంచి తప్పుకుంది. సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఫేస్‌బుక్‌ నుంచి ఎప్పుడో తప్పుకావాలని అనుకున్నాను. కానీ దీనిని అడ్డుపెట్టుకుని కొందరు తన ఫొటోలతో ఇలా దిగజారుడు చర్యలకు, తన జీవితాన్ని రోడ్డుకీడ్చే పనులు చేస్తారని ఊహించలేదని, వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే ఫేస్‌బుక్‌ నుంచి క్విట్‌ అయి సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 

మన విలువైన సమయాన్ని ఫేస్‌బుక్‌కి అనవసరంగా కేటాయిస్తున్నామని, మనందరి కాలాన్ని హరించే శక్తి ఫేస్‌బుక్‌కి ఉందని ఆమె తెలిపింది. పక్కనోడితో పలకరింపుకు కూడా దూరం చేస్తున్న సోషల్‌మీడియాను బహిష్కరించి తన ఇంటికి వచ్చి మాట్లాడితే అర్ధవంతమైన మాటలు మాట్లాడుకుందామని సెలవిచ్చిన ఆమె సామాజిక మాధ్యమాలకు బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Kavita Kaushik fires on Social Media:

Kavita Kaushik angry on facebook
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs