రాజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో చైన్నైలో జరిగిన ఐ డొనేషన్ క్యాంపెన్లో విజయ్ ఆంథోని పాల్గొన్నారు. నేత్రదానం యొక్క ఉద్దేశాలను, ఉపయోగాలను తెలియజేయటంతో పాటు స్వయానా విజయ్ ఆంథోని నేత్రదానం చేసేందుకు సైన్ చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రొఫెషనల్‌గా విజయ్ ఆంథోని ఎంత మంచి నటుడో, పర్సనల్‌గా అంత కంటే మంచి హృదయం ఉన్న వ్యక్తి అని, ఈ సందర్భంగా రాజన్ ఐ కేర్ సభ్యులు కొనియాడారు. ఇక ప్రస్తుతం విజయ్ ఆంథోని రోషగాడు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రంలో విజయ్ ఆంథోని సరసన నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గణేషా దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంథోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.