Advertisement
Google Ads BL

ఇదే కదా.. నందమూరి ఫ్యాన్స్ కోరుకునేది


ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో.. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీతో కలిస్తే అదో పెద్ద సెన్సేషన్ చేసిన మీడియాకి అప్పుడప్పుడు నందమూరి ప్యామిలీ మీద కూడా మీడియా డేగ కన్ను వేసే ఉంటుంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో కూడా లుకలుకలున్నాయి. అందుకే మీడియాకి అది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి ఫ్యామిలీ బాలకృష్ణ పెద్దగా కలవడు. అది కూడా బావగారు చంద్రబాబు గురించే అనేది ఓపెన్ టాక్. చంద్రబాబు.. బాలకృష్ణకి చెప్పడం వలనే ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసాడని... ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలను వదిలేసి హరికృష్ణని కూడా బాలకృష్ణ దూరం పెట్టేశాడు. హరికృష్ణని దూరం పెట్టేసిన బాలయ్య బావగారు చెప్పినట్టు నడుచుకోవడం నందమూరి ఫాన్స్ ని కాస్త షాక్ కి గురిచేసింది.

Advertisement
CJ Advs

అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో అంటీముట్టనట్లు ఉన్నా.. హరికృష్ణకి జబ్బు చేసినప్పటి నుండి కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీతో పాటుగా ఎన్టీఆర్ ని అక్కున చేర్చుకున్నాడు. ఇక జానకి రామ్ మరణంతో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బాగా కలిసిపోయారు. హరికృష్ణకి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రెండు కళ్ళులా మారారు. ఇక కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ని చూసుకుంటూనే బాలయ్య ఫ్యామిలితోను తత్సంబందాలు కొనసాగించాడు. అయితే గత కొన్నాళ్లుగా హరికృష్ణ ఫ్యామిలీతో దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు అన్న హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని అక్కున చేర్చుకున్నట్లే కనబడుతుంది.

అన్నగారు మరణంతో హరికృష్ణ ఇంటిదగ్గర ఉండి ఏర్పాట్లను  చూస్తూ.. గవర్నర్, కేసీఆర్ లను రిసీవ్ చేసుకోవడం దగ్గరనుండి.... అన్నగారి పాడిమోస్తూ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు దగ్గరగా ఉన్నాడు. ఇక తాజాగా నిన్న హరికృష్ణ ఇంటిదగ్గర జరిగిన భజనలో బాలకృష్ణ భోజనం చేస్తూ ఆ ప్లేట్ తో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు భోజనము చేసే దగ్గరికి వెళ్లి వారితో మాట కలపడమే కాదు.. ఎన్టీఆర్... బాబాయ్ బాలకృష్ణ చెప్పేది శ్రద్దగా వినడం.. అక్కడే కళ్యాణ్ రామ్ కూడా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిజంగా ఆ వీడియో చూసిన నందమూరి ఫాన్స్ మాత్రం మాకు కావాల్సింది ఇదే అంటూ.. మేమంతా ఒకటే అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి మొదలెట్టారు. ఇక ఎన్టీఆర్ తో బాలయ్య మాట్లాడే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇక హరికృష్ణ చనిపోయి తన కొడుకులను తన ఫ్యామిలీతో కలిపాడంటున్నారు నందమూరి ఫాన్స్.

Balakrishna Suggestions to NTR and Kalyan Ram:

Balakrishna and NTR’s Video Goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs