Advertisement
Google Ads BL

స్టార్ హీరోతో కమల్ సినిమా మొదలైంది


ఇటీవల ఆస్కార్‌ రవిచంద్రన్‌ విడుదల చేయలేకపోయిన 'విశ్వరూపం 2'ని కమలే తన సొంతం చేసుకుని రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్  పతాకంపై తానే విడుదల చేశాడు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 'విశ్వరూపం'కి వచ్చిన రెస్పాన్స్‌లో కనీసం ఒక్కశాతం కూడా ఈ చిత్రానికి రాలేదు. దీంతో ఆయనకు భారీ నష్టాలే మిగిలాయి. మరోవైపు ఆయన మొదలుపెట్టిన 'మరుదనాయగం', 'శభాష్‌నాయుడు' వంటి చిత్రాలు సగంలో ఆగిపోయి ఆర్దికంగా ఆయనను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే కమల్‌ గొప్ప నటుడు, దర్శకుడు మాత్రమే కాదు.. భారీ నిర్మాత కూడా. ఆయన తన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ బేనర్‌లో గతంలో ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించి ఉన్నాడు. ఇక ఈయన ఎవరినైనా నమ్మితే వారితో చిత్రాలు చేస్తూనే ఉంటారు. కె.బాలచందర్‌, కె.విశ్వనాథ్‌, సింగీతం శ్రీనివాసరావు.. రమేష్‌ అరవింద్‌.. ఇలా ఉదాహరణగా ఎందరినో చెప్పుకోవచ్చు. అలాగే ఈయన నమ్మిన మరో దర్శకుడు రాజేష్‌సెల్వ. కమల్‌కి శిష్యుడైన ఈయన 'కాలాపానీ' చిత్రంతో దర్శకునిగా పరిచయం అయ్యాడు. తర్వాత 'విశ్వరూపం, ఉత్తమ విలన్‌' చిత్రాలలో నటించాడు. కమల్‌తో 'తూంగావనం' (తెలుగులో 'చీకటిరాజ్యం') చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

తాజాగా ఆయన రాజేష్‌సెల్వ దర్శకత్వంలో మరో పర్‌ఫెక్షనిస్ట్‌, కమల్‌ తర్వాత అంతలా నటనా సత్తా ఉన్న విక్రమ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తానే నిర్మాతగా ప్రారంభించాడు. ఇందులో విక్రమ్‌కి జోడీగా కమల్‌ చిన్నకూతురు అక్షరహాసన్‌ నటిస్తోంది. ఈ చిత్రం తాజాగా మూహూర్తం జరుపుకుంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Kamal Produces Hero Vikram Movie:

Kamal Haasan Producer for Cheekati Rajyam Director Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs