Advertisement
Google Ads BL

దిల్ రాజు సెంటిమెంట్: జయసుధ ఇన్..!


దిల్‌రాజు చిత్రాలంటే అందులో జయసుధ, ప్రకాష్‌రాజ్‌లు ఉంటే పెద్ద హిట్‌ అవుతుందనే సెంటిమెంట్‌ అందరిలో ఉంది. ఆ సెంటిమెంట్‌ తనకు కూడా ఉందని దిల్‌రాజు కూడా ఒప్పుకుంటాడు. కేవలం సెంటిమెంట్‌ అని కాకుండా వారు ఇద్దరు కలిసి నటిస్తే సినిమాకే అదనపు హంగు వస్తుంది. ఏదో తెలియని నిండుదనం ఏర్పడుతుంది. గతంలో మహేష్‌బాబు దిల్‌రాజు బేనర్‌లో వెంకటేష్‌తో కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రంలో మహేష్‌, వెంకీలు సోదరులుగా నటిస్తే వారికి తల్లిదండ్రుల పాత్రలను జయసుధ, ప్రకాష్‌రాజ్‌లే పోషించారు. ఆ చిత్రం పెద్ద హిట్‌ అయింది. ఇప్పుడు మహేష్‌బాబు హీరోగా తన ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా దిల్‌రాజు-అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రంలో కూడా మహేష్‌కి తల్లిదండ్రులుగా మరోసారి సహజనటి జయసుధ, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌లే నటిస్తుండటం విశేషం. 

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఆల్‌రెడీ ట్యూన్స్‌ కూడా ఇచ్చేశాడు. ఇప్పటికే జయసుధ పాత్రకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని సమాచారం. త్వరలో ప్రకాష్‌రాజ్‌ పాత్ర సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. మరోవైపు దిల్‌రాజు ఇటీవల శ్రీనివాస కళ్యాణంపై బాగా దృష్టి పెట్టాడు. కానీ ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతం ఆయన రామ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా గతంలో 'సినిమా చూపిస్తా మావా, నేనులోకల్‌' చిత్రాలతో భారీ విజయాలను సాధించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' అనే చిత్రం నిర్మిస్తున్నాడు. 

ఇటీవల ఈ చిత్రం రషెష్‌ చూసిన ఆయన రెండు మూడు సీన్స్‌ని మరలా రీషూట్‌ చేయమని త్రినాథరావు నక్కినను ఆదేశించాడట. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విజయదశమి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ తేదీనే సినిమా ఖచ్చితంగా రిలీజ్‌ అయ్యేలా చూడాలని కూడా ఆయన త్రినాథరావు నక్కినను కోరాడట. ఈ చిత్రం కూడా హిట్‌ సాధిస్తే త్రినాథరావు నక్కిన హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టినట్లు అవుతుంది. 

Jayasudha in Mahesh Babu Maharshi Movie:

Dil Raju Follows Sentiment for Maharshi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs