Advertisement
Google Ads BL

ఈ సైలెంట్ కి అర్ధమేంటి చరణ్..?


ఈ మధ్యన సినిమాలన్నీ ఫస్ట్ లుక్స్, ఫస్ట్ టీజర్స్ ఇలా బయటికి రాకముందే నెట్ లో లీకై భారీ బడ్జెట్ చిత్ర బృందాలను తెగ టెంక్షన్ పెడుతున్నాయి. ఏదైనా సినిమా ఫస్ట్ లుక్ గాని టీజర్ గాని విడుదలవుతుంది అని అనౌన్స్ చేస్తున్నారో లేదో.. ఈ లోపు ఆ సినిమా యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆ లుక్ కి సంబందించిన పిక్స్, టీజర్ లోని కొన్ని సీన్స్ ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇక ఆ తర్వాత యూనిట్ సభ్యులు ఎంతగా జాగ్రత్త పడ్డప్పటికీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అయితే ఇప్పుడు టైటిల్ విషయంలోనూ కొన్ని లీక్స్ బయటికొచ్చి... తర్వాత ఆటోమాటిక్ గా బయటికొచ్చిన టైటిల్స్ లో ఏదో ఒకటి చిత్ర బృందం ఫైనల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఒక భారీ బడ్జెట్  సినిమా విషయంలో మాత్రం  అలాంటి లీకులేవీ బయటికి రావడం లేదు. ఆ సినిమా ఏమిటంటే రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ ఎంటెర్టైనెర్ సినిమా. రామ్ చరణ్ రంగస్థలం వంటి పిరియాడికల్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బోయపాటి - రామ్ చరణ్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బీహార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదలు పెట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సినిమా టైటిల్ గాని, లుక్ గాని బయటికి రాలేదు. అసలు ఈ సినిమాకి సంబందించిన ఎటువంటి విషయాలు బయటికి రాకుండా దర్శకుడు బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అసలు చరణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ గాని, లుక్ విషయంలో గాని ఎలాంటి లీకులు కనబడడం లేదు. అయితే భారీ అంచనాలున్న ఈ సినిమా మీద ఎలాంటి లీకులు బయటికి వచ్చినా.... భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పటికే మంచి అంచనాలున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని.. అందుకే ఏ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే ఎలాంటి హైప్ లేకుండా సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే సందర్భంగా సింపుల్ గా చరణ్ సినిమా లుక్ తో పాటుగా టైటిల్ ని రివీల్ చెయ్యాలని భావించే... కనీసం టైటిల్ ప్రకటిస్తామని విషయాన్నీ కూడా చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారట. రామ్ చరణ్ కి జోడిగా భరత్ లవర్ కైరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాని భారీగా డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

No Hype on Charan and Boyapati Film First Look:

Ram Charan and Boyapati Film 1st Look on Pawan Kalyan Bday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs