ఎన్ని సినిమాలు చేసినా యావరేజ్ లో.. లేదంటే ప్లాప్స్. అందుకే సొంతంగా తల్లి, తండ్రి, తమ్ముడు కలిసి ఒక బ్యానర్ ని స్థాపించి కొడుకు బాధ్యతను నెత్తినెట్టుకున్నారు నాగ శౌర్య కుటుంబ సభ్యులు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన నాగ శౌర్య ఫ్యామిలీ... ఆ నిర్మాణ సంస్థ నుండి వెంకీ కుడుముల దర్శకుడిగా ఛలో సినిమాని లో బడ్జెట్ లో తెరకెక్కించారు. ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన..... చక్కటి ప్రమోషన్స్ తో మంచి హిట్ అందుకున్నారు. ఇక దర్శకుడు వెంకీకి ఐరా వారు ఒక కాస్ట్లీ కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అలాగే హీరోగా తల్లితండ్రుల నుండి నాగ శౌర్య కూడా ఒక మంచి కారుని బహుమతిగా అందుకున్నాడు.
ఇక అదే ఊపులో మళ్ళీ నాగ శౌర్య తన ఓన్ బ్యానర్ లోనే @నర్తనశాల సినిమాని శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... మొదలు పెట్టాడు. ఈలోపు ఛలో కన్నాముందు ఒప్పుకున్న కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయి ఎప్పుడు వెళ్ళిపోయాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ సినిమా ప్రమోషన్స్ లో నాగ శౌర్య ఎక్కడా కనబడలేదు. సో ఆ సినిమాల గురించి ప్రేక్షకుడికి పెద్దగా తెలియదు అందుకే పట్టించుకోలేదు. ఇక ఓన్ బ్యానర్ లో చక చక కానిచ్చేసిన @నర్తనశాల నిన్న గురువారమే ప్రేక్షకుల ముందుకు రావడం సినిమాకి ప్రేక్షకులు, క్రిటిక్స్ సినిమాకి ప్లాప్ టాక్ ఇచ్చారు. మంచి ప్రమోషన్స్ తో బరిలోకి దిగినా... నాగ శౌర్య సినిమాలో కంటెంట్ అండ్ కామెడీ తక్కువ కావడంతో సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది.
నాగ శౌర్య ఛలో సినిమాలో నటనతో పోలిస్తే నర్తనశాలలో నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేదని... డైరెక్షన్ స్కిల్స్ అంతంత మాత్రం ఉన్నాయని, కథ, కథనాల్లో ఉన్న లోపాలు, మ్యూజిక్ అంతగా ఎక్కకపోవడం, ఎడిటింగ్ లో షార్ప్ నెస్ లేకపోవడం, కామెడీ ఆకట్టుకోలేకపోవడం వెరసి సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. సినిమా మొత్తం మీద జయ ప్రకాష్ రెడ్డి నటన హీరోయిన్స్ గ్లామర్ షో తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లేవంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో అంటున్నారు.