Advertisement
Google Ads BL

దర్శకురాలు బి. జయ ఇక లేరు


టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో నిర్మాత బి.ఏ రాజు సతీమణి, సినీ పాత్రికేయురాలు, దర్శకురాలు బి. జయ అనారోగ్య కారణాలతో గత అర్ధరాత్రి కన్ను మూశారు. గుండె పోటుతో ఆవిడ మృతి చెందారు. చంటిగాడు, లవ్‌లీ, వైశాఖం వంటి ఫీల్ గుడ్ మూవీస్‌తో మహిళా దర్శకురాలిగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్న ఆవిడ హఠాన్మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. బిఏ రాజు మహేష్, నాగార్జున వంటి హీరోలకు పర్సనల్ పీఆర్వో గా అనేక చిత్రాలకు పీఆర్వో గా పని చేస్తూనే తన భార్య జయ డైరెక్ట్ చేసే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. భార్యభర్త లిద్దరికి సినిమాలే లోకం. జయగారి మరణం తీరని లోటు. ఆమె మరణానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బి. జయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆవిడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది సినీజోష్. 

Advertisement
CJ Advs

Journalist and Director B Jaya Passes Away:

<h3 class="text-center"><span style="font-weight: normal;">Film Director and Journalist B Jaya No More</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs