Advertisement
Google Ads BL

ఇంత క్లియర్‌గా ఉంటే.. గొడవల్లేవంటోందేంటి?


ఈమధ్యన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ కి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి మధ్యన విభేదాలంటూ సోషల్ మీడియా దగ్గర నుండి... వెబ్, ప్రింట్ మీడియా వరకు బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ విభేదాల గురించి దర్శకుడు క్రిష్ కామ్ గా ఉండడం... కంగనా మా మధ్యన ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం.. మణికర్ణిక విషయంలో చాలానే సమస్యలు దర్శకుడు క్రిష్ కి కంగానికి ఉన్నట్టుగా వార్తలు రావడం మాత్రం  ఆగడం లేదు. కంగనా ఏదో మా మధ్యన మణికర్ణిక విషయంలో విభేదాలు లేవని చెప్పినా... వారి మధ్యన నిజంగానే గొడవులున్నాయని కొన్ని విషయాల్లో కంగనా రివీల్ చేస్తూనే ఉంది.

Advertisement
CJ Advs

మణికర్ణిక సినిమా విషయంలో కంగనాతో విభేదించిన క్రిష్ సైలెంట్ గా టాలీవుడ్ లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బిజీ అయ్యాడు. ఇక కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఓన్ గా చూసుకుంటుందని టాక్ ఉంది. అయితే ఈ మధ్యన తాజాగా కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో క్రిష్ ని తప్పించి తన పేరునే హైలెట్ చేసుకుంటుందంటున్నారు. అయితే ఆ విషయం నిజమనే సంకేతాలు కనబడుతున్నాయి. ఎలా అంటే కంగన డైరెక్షన్ లో అంటూ మణికర్ణిక క్లాప్ బోర్డ్పై ప్రింట్ చేసింది అంటూ ఇప్పుడొక క్లాప్ బోర్డు ఫోటో సోపీసీఎల్ మీడియాలో హంగామా చేస్తుంది.

ఇక అదేమిటి కంగనా పేరు డైరెక్షన్ లో కనబడడం చూసి ఆమెని ప్రశ్నిస్తే... అదేం లేదు క్రిష్ మణికర్ణికా డైరెక్టర్ అని చెబుతూనే మా మధ్యన విభేదాలేం లేవని చెబుతుంది. అలాగే ఈ విషయాలను తనకు కాకుండా తన తరుపున తన పీఆర్వో రాజేష్ మాట్లాడడం చూస్తుంటే కంగనాకు , క్రిష్ కి మధ్యన చెడిందనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ విషయమై ఇప్పటి వరకు దర్శకుడి క్రిష్ స్పందించక పోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది.

Proof: Manikarnika Director Kangana Ranaut:

Differences Between Kangana and Krish, This is the Proof
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs