Advertisement
Google Ads BL

మెగాస్టార్‌కి అవార్డు ఇచ్చింది ఎవరో తెలుసా?


తాజాగా చిరంజీవి మాట్లాడుతూ, నాకు అవార్డులు ఇస్తానంటే వేడుకకు రాను. ఇవ్వనంటేనే వస్తాను అని తెలిపాడు. ఆ విషయంలో 'సంతోషం' సురేష్‌ కొండేటికి ముందే చెప్పాను. కానీ నన్ను మోసం చేసి గానకోకిల ఎస్‌.జానకి చేతుల మీదుగా నాకు అవార్డును ఇప్పించి నన్ను సురేష్‌ లాక్‌ చేశాడు. దాంతో కాదనలేకపోతున్నాను.. అని అన్నాడు. 

Advertisement
CJ Advs

16వ సంతోషం సౌత్‌ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుక హైదరాబాద్‌లో జరిగిన సందర్భంగా చిరంజీవి ఈ మాట అన్నారు. తొలిసారిగా జానకి గారి నుంచి అవార్డు తీసుకోవడం గర్వంగా ఉంది. ఇదే అవార్డును వేరే వారి చేతుల మీదుగా ఇప్పించి ఉంటే సున్నితంగా తిరస్కరించేవాడిని. అన్నారు. 

ఇక గత ఐదేళ్లుగా ఈ అవార్డు వేడుకకు రమ్మని సురేష్‌ అడుగుతుంటే వీలు కాకుండా పోయింది. చిరంజీవి నటించిన చిత్రాలలోని హిట్స్‌ సాంగ్స్‌ పాడినవి ఎక్కువగా నేనే. ఆయన నటించిన 'ఖైదీనెంబర్‌ 150' చిత్రం చూశాను. పాత చిరంజీవిని చూసినట్టే అనిపిపించింది... అని జానకి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కూడా హాజరయ్యారు. 

Chiranjeevi Takes Award From S Janaki at Santosham Awards:

S Janaki gives Santosham Award to Mega Star Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs