Advertisement
Google Ads BL

నాగ్‌ బాగా అప్‌సెట్‌ అయ్యాడు..!


నాగార్జునకి బాలకృష్ణతో కంటే హరికృష్ణతో ఎంతో అనుబంధం ఉంది. ఎన్నోసార్లు తాను హరికృష్ణని అన్నయ్యగా సంబోధించేవాడు. తాజాగా ఆయన హఠాన్మరణం నేపధ్యంలో నాగార్జున బర్త్‌డే వేడుకలను క్యాన్సిల్‌ చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి ‘సీతారామరాజు’ అనే చిత్రంలో కూడా కలిసి నటించారు. మరోవైపు నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన నానితో కలిసి నటిస్తున్న ‘దేవదాస్‌’ చిత్రంలో నానికి జోడీగా నటిస్తోన్న రష్మికమండన్న తమషా పోస్ట్‌ చేసింది. 

Advertisement
CJ Advs

నాగార్జున సార్‌.. మీ అభిమానిగా, బాడీగార్డ్‌గా నాకు ఎంతో గర్వంగా ఉంది. మీ జీవితాన్ని కింగ్‌ సైజ్‌లో జీవించండి. మీకు అన్నివైపుల నుంచి నేను భద్రత కల్పిస్తాను అంటూ ట్వీట్‌ చేసింది. ఈ సందర్బంగా ‘దేవదాస్‌’ చిత్రంలోని ఓ స్టిల్‌ని ఆమె పోస్ట్‌ చేసింది. దీనిని బట్టి చూస్తే ‘దేవదాసు’ చిత్రంతో రష్మికమండన్న.. నాగార్జునకు బాడీ గార్డ్‌గా నటిస్తోందా? అనే అనుమానం వస్తోంది. మరోవైపు నాగార్జున బర్త్‌డే కానుకగా అక్కినేని అఖిల్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం ఫస్ట్‌లుక్‌ని , ప్రచారంలో ఉన్న ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ని ప్రకటించాలని భావించారు. కానీ హరికృష్ణ హఠాన్మరణంతో దీనిని వాయిదా వేశారు. 

ఇక నాగ్‌ బర్త్‌డే కానుకగానే నాగచైతన్య మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ ట్రైలర్‌ని విడుదల చేయాలని భావించారు. కానీ దానిని కూడా వాయిదా వేశారు. దీంతో పాటు విశాల్‌ నటిస్తోన్న ‘పందెంకోడి2’ టీజర్‌ని కూడా ఆ చిత్ర యూనిట్‌ వాయిదా వేసింది. మొత్తానికి హరికృష్ణ మరణంతో పలు చిత్రాల టీజర్ల నుంచి అనేక కార్యక్రమాలు టాలీవుడ్‌లో వాయిదా పడ్డాయి. పరిశ్రమ మొత్తం హరికృష్ణ మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది. 

Nagarjuna shocked with Harikrishna death:

Nagarjuna Cancelled his Bday celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs