Advertisement
Google Ads BL

హరికృష్ణ కి ఇచ్చే నివాళి ఇదేనా?


నందమూరి హరికృష్ణ నిన్న బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూసిన విషయం తెలిసిందే. 61 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిన హరికృష్ణ మరణానినికి ఇండస్ట్రీలోని ప్రముఖులు, రాజకీయనాయకులు, నందమూరి అభిమానులు ఘన నివాళి అర్పిస్తున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య ఈ రోజు గురువారం సాయంత్రం ఫిలిం నగర్ మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. హరికృష్ణ మరణం కుటుంబానికి, రాష్ట్రానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రెండు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ హరికృష్ణ మృతి తీరని లోటని హరికృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరిపించాలని సీఎస్ ని ఆదేశించారు.

Advertisement
CJ Advs

అయితే సీనియర్ ఎన్టీఆర్ గతంలో నటించిన నర్తనశాల టైటిల్ తో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన @నర్తనశాల సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు హంగామాతో వచ్చింది.  యంగ్ హీరో నాగ శౌర్య నటించిన @నర్తనశాల ను ఈ రోజు ఎటువంటి హడావిడి లేకుండా విడుదల చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. మరియు నందమూరి అభిమానులు @నర్తనశాల చిత్రం విడుదల వాయిదా పడుతుంది అని భావించారు. కానీ నర్తనశాల థియేటర్స్ దగ్గర నాగ శౌర్య ఫాన్స్ హంగామా చెయ్యడం... రాష్ట్రంలో హరికృష్ణ కి రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన టైం లో తమ సినిమాకి అంత హడావిడి చెయ్యడం అవసరమా అంటూ నందమూరి అభిమానులు కొంతమంది నాగ శౌర్య మీద ఫైర్ అవుతున్నారు.

@నర్తనశాల చిత్రంలో మొదట వచ్చే డైలాగ్ హరికృష్ణ అంటూ సీనియర్ ఎన్టీఆర్ కొడుకుల పేర్లు తో సినిమా మొదలౌతుంది నర్తనశాల టైటిల్ తో నందమూరి ఫామిలీ కి మంచి అనుబంధం వుంది ఈ టైటిల్ తోనే బాలకృష్ణ కూడా సినిమా మొదలుపెట్టి అనివార్య కారణాలవల్ల సినిమా ఆపేసాడు అలాంటి నందమూరి టైటిల్ వాడుకున్న నాగశౌర్య నందమూరి ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటున్నారు వారు. ఇండస్ట్రీ మొత్తం హరికృష్ణ కి నివాళులు అర్పిస్తున్న టైం లో కాస్త కామ్ గా థియేటర్స్ లోకి వస్తే ఓకె. కానీ ఇలా హంగామా తో  రావడం అవసరమా అంటున్నారు. అసలు హరికృష్ణకు నివాళులు అర్పించేది ఇలాగేనా అంటూ పెదవి విరుస్తున్నారు.

naga shourya fans hungama at theaters:

naga shourya fans hungama at theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs