Advertisement
Google Ads BL

అల్లు అర్జున్‌కి పోటీగా తయారైన సమంత..!


అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాలు హిందీలో డబ్ అయినాయి అంటే యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిపోతుంది. అందుకే అల్లు అర్జున్ సినిమాలకు హిందీ డబ్బింగ్ హక్కులకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. మొన్నటికి మొన్న సరైనోడు సినిమా యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేసింది. తాజాగా అల్లు అర్జున్ కి పోటీగా సమంత అ.. ఆ సినిమా కూడా హిందీ డబ్బింగ్ తో యూట్యూబ్ లో విడుదల చేశారు.

Advertisement
CJ Advs

తెలుగులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో త్రివిక్రమ్ స్టయిల్‌తో మీనా నవల ఆధారంగా నితిన్ - సమంత హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన అ... ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు... అదరగొట్టే కలెక్షన్స్ తీసుకొచ్చింది. అనసూయ పాత్రలో సమంత నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఆనంద్ గా నితిన్ కూడా కామెడీతో కూడిన పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఇక అనసూయ తల్లిగా నదియా పాత్ర కూడా ఈ సినిమాకు కీలకం. ఇక ఆ సినిమా ఇప్పుడు హిందీ లో డబ్ అవడమే కాదు రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో విడుదల చేసారు.

మరి యూట్యూబ్ లో విడుదల చేసిన అ... ఆ సినిమా కేవలం 48గంటల్లో 11మిలియన్ వ్యూస్ ను సాధించింది. మరి ఈ రేంజ్ వ్యూస్ హీరోయిన్ కీ రోల్ గా తెరకెక్కిన సినిమాకి రావడం చాలా అరుదు. ఇక ప్రస్తుతం స్టార్ హీరో అల్లు అర్జున్ కి హిందీ యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ తో ఇప్పుడు సమంత కూడా తన అ.. ఆ సినిమాతో పోటీ పడిందన్నమాట. మరి సమంతకి తెలుగులో హీరోయిన్ గా భారీ క్రేజున్న సంగతి తెలిసిందే.

Youtube Records: Allu Arjun vs Samantha:

Samantha A Aa movie dubbed in to Hindi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs