Advertisement
Google Ads BL

స్టార్ స్టేటస్ అంటే అది: నాగశౌర్య


ఛలో సినిమాతో చెలరేగిపోతున్న నాగశౌర్య నర్తనశాలతో ఈ ఏడాది నాలుగోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఛలో, కణం, అమ్మమ్మగారిల్లు సినిమాల్తో ప్రేక్షకులను పలకరించిన నాగశౌర్య ఇప్పుడు @నర్తనశాల అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ రోజు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నాగశౌర్యకి ఛలో సినిమా హిట్ తో కాస్త యాటిట్యూడ్ మారిందని... కొంచెం ఫోజులు కొడుతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే @నర్తనశాల సినిమా ప్రమోషన్స్ ని ఫ్యామిలీ తో పీక్స్ లోకి తీసుకెళ్లిన నాగశౌర్య ఇప్పుడు కాస్త కాంట్రవర్షిల్ కామెంట్స్ చేసి ఇరుకున పడ్డాడు.

Advertisement
CJ Advs

@నర్తనశాల ప్రమోషన్స్ మీట్ లో నాగశౌర్య చేసిన కొన్ని వ్యాఖ్యలు  ఇప్పుడు కొందరి హీరోల ఫాన్స్ ని బాగా హార్ట్ చేశాయి. ఇంతకీ నాగశౌర్య అన్న వ్యాఖ్యలు ఏమిటంటే...ఇకపై కొత్తగా స్టార్లు రారు .. చరణ్ తోనే స్టార్ స్టేటస్ అనేది ఆగిపోయింది.... యువ హీరోలను ఉద్దేశించి నాగశౌర్య ఫ్లో లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు యంగ్ హీరోల ఫాన్స్ ని బాగా హార్ట్ చేశాయి. ఇంతకీ రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ని ఎత్తేసిన నాగశౌర్య.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల్తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండని మర్చిపోయాడని ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది.

మరి ఇంత ప్రచారం జరిగాక... విజయ్ దేవరకొండ ఫాన్స్ ఊరుకుంటారా.... అందుకే నాగశౌర్యని ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు. కొద్ది కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న విజయ్ ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా అంటూ.. నాగశౌర్య ని విజయ్ దేవరకొండ ఫాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫాన్స్ చేసిన ట్రోల్ విషయం తెలిసిందో ఏమో... నాగశౌర్య @నర్తనశాల మూవీ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. స్టార్ స్టేటస్ అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదని. .. ఆ స్థాయిని అందుకోవడానికి చిరంజీవి గారికి  చాలాకాలం పట్టింది. పవన్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల వరకూ వసూలు చేస్తోంది .. క్రేజ్ అంటే అది అనే అభిప్రాయం నాది... అంటూ క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య.... ఈ విషయంలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేను కామెంట్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక్క విజయ్ దేవరకొండను మాత్రమే కాదు .. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదు.. అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చేశాడు.

Naga Shourya Clarity on Star Status:

Naga Shourya Clarity on his Comments at @narthanasala press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs