Advertisement
Google Ads BL

శృతిహాసన్ మరో కొత్త స్టెప్..!


కమల్‌హాసన్‌, సారికహాసన్‌ల కుమార్తెలు శృతిహాసన్‌, అక్షరహాసన్‌. ఇక శృతిహాసన్‌కి నటనతో పాటు సంగీతం, పాడటం వంటి వాటిల్లో కూడా అనుభవం ఉంది. అయితే ఈమధ్య ఈ అమ్మడు కెరీర్‌ని పట్టించుకోకుండా తన ప్రియుడి ధ్యాసలోనే ఉంటోందని వార్తలు వస్తున్నాయి. 'గబ్బర్‌సింగ్‌' ద్వారా గోల్డెన్‌లెగ్‌గా మారిన ఈమె 'కాటమరాయుడు' చిత్రంతో తన ఫిజిక్‌ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత 'సంఘమిత్ర' చేస్తానని చెప్పి కూడా దాని నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. 

Advertisement
CJ Advs

ఇక శృతిహాసన్‌ తల్లిదండ్రులైన కమల్‌హాసన్‌, సారికా హాసన్‌లు ఇద్దరు సినీ ఫీల్డ్‌కి బాలనటీనటులుగానే పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా శృతిహాసన్‌కి ఎంతో క్రేజ్‌ ఉంది. అయితే ఆమె చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోందో లేక తనదైన ప్రియుడి మైకంలో పడిందో తెలియడు గానీ చిన్నచిన్నగా ఫేడవుట్‌ దశకు చేరుకుంటోంది. 

ఈమె తాజాగా మాట్లాడుతూ, మా అమ్మనాన్నలు చిన్నవయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వాళ్ల వారసురాలిగా నేను ఈ రంగంలో ఉన్నాను. వారు గర్వించే విధంగా ఈ ఫీల్డ్‌లో ఉండాలని భావిస్తున్నాను. ఈ విషయంలో నాపై అంచనాలు ఉండాలని నేను కోరుకోవడం లేదు. నాకు నచ్చినట్లుగా నా పనులను చేసుకుంటూ ముందుకువెళ్తాను. ఇప్పటివరకు నేను మా నాన్న చిత్రాలకి మాత్రమే నటన కాకుండా ఇతర రంగాలలో పనిచేశాను. ఆయనతో కలసి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇక అమ్మతోనూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. అందుకే మా అమ్మతో కలసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిజంగా ఇది నాకెంతో సంతోషాన్ని అందించే విషయం అని శృతిహాసన్‌ చెప్పుకొచ్చింది.

Shruti Haasan starts Production House:

Shruti Haasan starts Production House
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs