Advertisement
Google Ads BL

నాగ్‌ బర్త్‌డే స్పెషల్ స్టిల్స్ బాగున్నాయ్!


నేడు కింగ్‌ నాగార్జున జన్మదినోత్సవం సందర్భంగా పలు పత్రికల్లో ‘దేవదాస్‌’ చిత్రం యాడ్స్‌ ప్రత్యక్షమయ్యాయి. నాగార్జున లాంగ్‌కోట్‌ ధరించి, తలపై హ్యాట్‌ ధరించి ఉన్నస్టిల్స్‌ అక్కినేని అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. మరోవైపు నాగ్‌ బర్త్‌డే సందర్భంగా ‘దేవదాస్‌’ చిత్రం యూనిట్‌ నిన్ననే నాగార్జున స్టిల్స్‌ని విడుదలచేసింది. వీల్‌చైర్‌లో కూర్చొని ఉన్ననాగార్జున, ఓ స్థంభానికి ఆనుకుని ఉన్న నాగ్‌ల స్టిల్స్‌ అందరికీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘దేవదాస్‌’ చిత్రానికి యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, వైజయంతీ మూవీస్‌ బేనర్‌లో అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

గతంలో నాగార్జున, అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో ‘ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా, ఆజాద్‌’ వంటి చిత్రాలు నిర్మితమయ్యాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ఆధారంగా శ్రీదేవి హీరోయిన్‌గా ‘ఆఖరిపోరాటం’ రూపొంది విజయం సాధించింది. ఆ తర్వాత రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్‌గానే ‘గోవిందా గోవిందా’ చిత్రం వచ్చింది. ఇక చిన్నవయసులోనే వెంకటేష్‌తో ‘గణేష్‌’అనే సామాజిక సందేశం ఉన్న చిత్రాన్ని తీసి అవార్డులు రివార్డులు కొల్లగొట్టిన తిరుపతి స్వామి దర్శకత్వంలో ‘ఆజాద్‌’ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని అవార్డులు, ప్రశంసలు వచ్చినా ఆర్దికంగా ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. ఇలా చెప్పుకుంటే నాగార్జునతో అశ్వనీదత్‌ తీసిన చిత్రాలలో ‘ఆఖరిపోరాటం’ మాత్రమే లాభాలను ఆర్జించి పెట్టింది. 

ఇక ప్రస్తుతం రూపొందుతున్న ‘దేవదాస్‌’ చిత్రంలో నాగార్జునతో పాటు నేచురల్‌ స్టార్‌ నాని కూడా నటిస్తున్నాడు. ఇందులో నాగార్జున సరసన ఆకాంక్షసింగ్‌ నటిస్తుండగా, నాని సరసన రష్మిక మండన నటిస్తోంది. ఇప్పటికే రష్మిక మండన్న నటించిన రెండు తెలుగు చిత్రాలైన ‘ఛలో, గీతాగోవిందం’లు పెద్ద విజయం సాధించాయి. మరి ఈ ‘దేవదాస్‌’ చిత్రంతో ఆమె కూడా హ్యాట్రిక్‌ని కొట్టడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 27న విడుదల కానుంది. తన తండ్రి ఏయన్నార్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన ‘దేవదాస్‌’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండటం మరో విశేషంగా చెప్పాలి. 

Nagarjuna Birthday Special:

Nag special stills on his birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs