Advertisement
Google Ads BL

పెళ్లి షరత్తులకు నో చెబుతోన్న హీరోయిన్‌


నేటిరోజుల్లో సినీ రంగానికి చెందిన నటీమణులు వ్యక్తిగత జీవితాలు అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. పెళ్లి చేసుకునే వారు సినిమా ఫీల్డ్‌ని వదిలేయాలని చెప్పడం, దానికి నటీమణులు ఒప్పుకోకపోవడం వంటి పలు కారణాల వల్ల వారి పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. కొందరి వివాహాలు నిశ్చితార్దం వరకు వచ్చి కూడా రద్దు అవుతున్నాయి. అయితే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని భావించే వారు మాత్రం పెళ్లికి ముందే అన్ని విషయాలలో పక్కా క్లారిటీగా ఉంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇదే కోవకి చెందిన నటి పూర్ణ. తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించిన ఆమె తమిళంలో ప్రస్తుతం ఒకటి, మలయాళంలో మూడు చిత్రాలలో నటిస్తోంది. సంప్రదాయ వస్త్రధారణ, నిండైన పాత్రల ద్వారా ఆమె ప్రేక్షకులకు చేరువయ్యింది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రల్లోనే కనిపించడం పూర్ణ స్పెషాలిటీ. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకి మలయాళంలో కంటే తమిళంలోనే మంచి పేరు వచ్చిందని, దీనికి కారణం మలయాళంలో పెద్ద హీరోలతో చేయకపోవడమేనని తెలిపింది. తాను స్వతహాగా డ్యాన్స్‌ కళాకారిణిని కావడంతో తనకు ఎక్కువగా నాట్యప్రధానమైన పాత్రలే వస్తున్నాయని ఆవేదన వ్యక్త చేసింది. 

ఇక ఈమె తన వివాహం గురించి మాట్లాడుతూ, నేనుఒక ముస్లిం. మా ఇంట్లోవారు కూడా నాకు వివాహం చేయాలని భావిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకుంటామని వస్తున్న వారు పలు షరత్తులు పెడుతున్నారు. ముఖ్యంగా సినిమాలను వదిలేయాలనే కండీషన్‌ ఎక్కువగా ఉంటోంది. పెళ్లి కోసం నన్ను నేను మార్చుకోలేను. అందుకే సంబంధాలు వెనక్కి పోతున్నాయని చెప్పుకొచ్చింది. నిజమే.. పెళ్లయిన తర్వాత అమ్మాయిలు మనసు చంపుకుని ఉండాల్సిన పనిలేదని చెప్పాలి. 

Poorna Conditions to Marriage:

Poorna Conditions to Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs