Advertisement
Google Ads BL

రవితేజా.. కిక్ ఏది...!


ప్రస్తుతం టాలీవుడ్ లో చిత్రపరిశ్రమ దగ్గర నుండి ప్రేక్షకులు వరకు అంతా కొత్తదనమే కోరుకుంటున్నారు. సినిమా టైటిల్స్ దగ్గర నుండి సినిమాలో కంటెంట్ వరకు అంతా కొత్తదనమే కోరుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రవితేజ త్రీ షేడ్స్ లో నటించిన 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ' కి టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement
CJ Advs

లేటెస్ట్ గా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. రవితేజ హీరోగా ఇలియానా క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. దానికి తగ్గట్టే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో మూడు గెట‌ప్పుల్లో దర్శనం ఇచ్చాడు రవి. అమర్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటే.. అక్బర్ లుక్ లో రవి ముస్లిం గెట్ అప్ లో టోపీ పెట్టుకున్నాడు... ఆంటోనీ లుక్ లో కోట్ వేసుకుని చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు రవితేజ.

పేక ముక్క‌ల్లో హీరో బొమ్మ‌ని చూపించ‌డం కూడా ఓల్డ్ కాన్సెప్టే. శ్రీను వైట్లకి ఇది కం బ్యాక్ ఫిలిం అవుతుందని.. తన మార్క్ కామెడీ ఇందులో ఉంటుందని అంతా ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. రవితేజ సింగల్ క్యారెక్టర్ చేస్తేనే ఫ్యాన్స్ కు ఫీస్ట్.. అలాంటిది త్రీ క్యారెక్టర్స్ చేస్తే పండగే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను వరస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. కాకపోతే రవితేజ త్రీ లుక్స్ చూస్తుంటే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. రవి హెయిర్ స్టైల్ లో కూడా మార్పులు లేవు. త్రీ గెట్ అప్స్ తో కనిపిస్తున్నప్పుడు ఏ ఒక్క గెట్ అప్ కి పోలిక ఉండకూడదు. కానీ ఇందులో అలా లేదు. మరి సినిమాలో ఏం చేస్తారో చూడాలి .

AAA First Look Just ok:

AAA First Look No Atraction 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs