ఒకనాడు సావిత్రి అంటే అందరిలో యమాక్రేజ్. నెల్లూరుకి చెందిన ఆమె ముఖ్యంగా ఏయన్నార్‌తో నటించిన చిత్రాలంటే మహిళలు, యూత్ విరగబడి చూసే వారు. నాడు వాణిశ్రీ చీరలు, వాణిశ్రీ జడకొప్పు. వాణిశ్రీ మేకప్.. ఇలా ప్రతిది ఓ సంచలనమే. అందరు తమను తాము వాణిశ్రీలా ఉండేలా చూసుకోవాలని టీనేజ్ యువతుల నుంచి పెద్ద వయసు మహిళల వరకు అందరు పడి చచ్చిపోయే వారు.
ఇక తాజాగా ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తాను యుక్తవయసులో ఉన్నప్పుడు వాణిశ్రీని ఎంతో ప్రేమించానని, వాణిశ్రీయే తన మొదట లవర్ అని చెప్పడం విశేషం. సౌతిండియన్ సినీ కల్చరర్ అసోసియేషన్‌ని ఆయనతో పాటు నెల్లూరుకు చెందిన మరో మంత్రి, రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ప్రారంభించారు. మొత్తం మూడు రోజుల పాటు ఇందులో షార్ట్‌ఫిలిం ఫెస్టివల్‌ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికాకృష్ణ, నటి వాణిశ్రీ, రచయిత, దర్శకుడు, హీరో కె.భాగ్యరాజా, నిర్మాత సి.కళ్యాణ్ వంటి వారు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, నేను వాణిశ్రీని ప్రేమించాను. ఆమెకి నేను వీరాభిమానిని, ఆమె చిత్రాలన్నీ చూశాను. అప్పటి సినిమాలు నాకు ఇప్పటికీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ, రూ.4కోట్లు లోపు బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలకు వినోదపు పన్ను, జీఎస్టీలో 9శాతం సబ్సిడీ ఇస్తామని, ఏపీలో సినిమాలు తీయాలని భావించే దర్శక నిర్మాతలకు లోకేషన్లలో ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని, ప్రతి ఏటా 10 చిత్రాలకు రూ.10లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.