Advertisement
Google Ads BL

మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పడడం లేదు


'భరత్ అనే నేను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు మహేష్ మాట్లాడుతూ.. 'మేము మేము బాగానే ఉంటాం.. మీరే బావుండాలి' అని ఫ్యాన్స్ ను ఉదేశించి మాట్లాడారు. ఎన్టీఆర్ కూడా మేము స్నేహంగానే ఉన్నామని చెప్పారు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత మహేష్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో కలిసి ఫొటోస్ దిగి మేము అంతా ఒక్కటే అని చెప్పారు. ఆ సఖ్యత హీరోస్ మధ్య ఉంది కానీ వారి ఫ్యాన్స్ మధ్య లేదు. ట్విట్టర్ సాక్షిగా మహేష్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకరినొకరు తిట్టుకుంటూ #siggulenintrfans అంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తీయడంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో మాటల యుద్ధానికి దిగారు.

మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ మహేష్ కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. అప్పుడు మహేష్ ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లయ్ ఇవ్వలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 'మహర్షి' సెట్స్ కి వెళ్లి ఫొటోలను ట్వీట్ చేస్తే, అతడికి రిప్లై ఇచ్చారు. దాంతో కొంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం రావడంతో.. మహేశ్ ని ఘోరంగా తిట్టడం మొదలుపెట్టారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ చూస్తూ ఊరుకోక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తిట్టడం స్టార్ట్ చేశారు. సో దాంతో గొడవ అలా స్టార్ట్ అయింది. అది మ్యాటర్. మరి దీనికి ఇరు హీరోస్ స్పందించి సర్ది చెబుతారేమో చూడాలి.

Twitter War Between NTR-Mahesh Fans Over Likes:

Silly Fight Between Mahesh and NTR Fans   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs