Advertisement
Google Ads BL

సాహో షూటింగ్ జరుగుతుందిలా!


హైదరాబాద్‌ వంటి చోట్ల షూటింగ్‌ పెట్టుకుంటే సాయంత్రానికి అందరు తమ ఇళ్లకు చేరుకుంటారు. దానివల్ల నటీనటులకు, ఇతరులకు తమ కుటుంబాలతో గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక కోణం మాత్రమే. అయితే దీనివల్ల అనుకున్న పని అనుకున్నంత వేగంగా సాగదు. అదే ఔట్‌డోర్‌ షూటింగ్‌ అంటే ఉదయం లేచింది మొదలు అందరు అదే షూటింగ్‌ మూడ్‌లో ఉంటారు. బహుశా అందుకేనేమో డైరెక్టర్‌ సుజీత్‌, హీరో ప్రభాస్‌లు కూడా 'బాహుబలి' రూట్‌నే ఫాలో అవుతున్నారు. 

Advertisement
CJ Advs

'బాహుబలి' షూటింగ్‌ ఎక్కువభాగం రామోజీ ఫిలింసిటీలో జరిగినప్పటికీ ఆ చిత్రం షూటింగ్‌ సందర్భంగా పనికి ఆటంకం కలగకుండా రాజమౌళి అందరి వసతిని ఆర్‌ఎఫ్‌సిలోనే ఏర్పాటు చేశాడు రాజమౌళి. ఇప్పుడు అదే రూట్‌ని డైరెక్టర్‌ సుజీత్‌ ఫాలో అవుతూ, తన యూనిట్‌లోని అందరినీ 'సాహో' మూడ్‌ నుంచి బయటికి రాకుండా చేస్తున్నాడట. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి షూటింగ్‌ పూర్తయ్యే దాకా ఆర్‌ఎఫ్‌సిలోనే షూటింగ్‌ చేస్తున్నారు. సాయంత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత అయినా హైదరాబాద్‌ సిటీకి వచ్చి మరలా ఉదయాన్నే ఆర్‌ఎఫ్‌సికి సమయానికి అందుకోవాలంటే ట్రాఫిక్‌ సమస్యల వల్ల ఆలస్యం అవుతుంది. 

అదే ఉద్దేశ్యంతో 'సాహో' యూనిట్‌ మొత్తానికి రామోజీ ఫిలింసిటీలోనే బస ఏర్పాటు చేశారట. వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రద్దాకపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Saaho Shooting in RFC:

Saaho Follows Bahubali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs