Advertisement
Google Ads BL

రష్మిక నిజ్జంగా గ్రేట్..!


తెలుగులో 'ఛలో' సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన రష్మిక మందన్న.. ఆ తర్వాత వెంటనే 'గీత గోవిందం' సినిమాతో తన నటనలతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో యూత్ ని ఫిదా చేసింది. రీసెంట్ గా ఆమె తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గర అయ్యేందుకు తన డబ్బింగ్ తానే చెప్పుకోబోతుంది.

Advertisement
CJ Advs

నాని - నాగార్జున మల్టీస్టారర్ గా రూపొందుతున్న 'దేవదాస్' చిత్రంలో రష్మిక నానికి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమె డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతుందంట. అయితే విజయ్ తో చేస్తున్న 'డియర్ కామ్రేడ్' సినిమాకే డబ్బింగ్ చెప్పాల్సిన రష్మిక ఆమె డేట్స్ సరిగా లేకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారు. 

సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 'దేవదాస్' చిత్రానికి ఇప్పుటి నుండి రెడీ అవుతుందంట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. లేటెస్ట్ గా రిలీజ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సిఉంది.

Rashmika Mandanna Own Dubbing for Devdas Movie :

Rashmika Mandanna to Experiment Her Telugu in Devdas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs