Advertisement
Google Ads BL

నర్తనశాల, పేపర్ బాయ్ కి భలే ఛాన్స్


ఆగస్టు 30న నాగ శౌర్య హీరోగా నటించిన ‘నర్తనశాల’ సినిమా నిన్న సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని యు బై ఎ సర్టిఫికెట్ తో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మీద ఫిలింనగర్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. నాగ శౌర్యతో పాటు టీం కూడా ఈ సినిమా హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉంది. నాగ శౌర్య 'గే' గా నటిస్తున్న ఈ సినిమాని ఐర క్రియేషన్స్ వారు అంటే నాగ శౌర్య ఓన్ బ్యానర్ నిర్మిస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఆ తర్వాతి రోజు అంటే నర్తనశాల విడుదల నెక్స్ట్ డే విడుదల కావాల్సిన  నాగ చైతన్య సినిమా శైలజారెడ్డి అల్లుడు... కేరళ వరదలు, అలాగే గీత గోవిందం ఎఫెక్ట్, అలాగే  నర్తనశాల ప్రభావంతో రెండు వారాల వెనక్కి వెళ్లిపోయింది. దాంతో నాగ శౌర్య  సినిమాకు ఆ రకంగా కూడా చాలా కలిసొచ్చింది. ఇక ఈ సినిమాపై నాగ శౌర్య మొదటి నుండి కాన్ఫిడెంట్  గా ఉన్నాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శౌర్య చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమా గురించి చెప్పాడు . మరి ఇంత పాజిటివ్ వైబ్స్ వస్తున్న, అలాగే ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేపడుతున్న  ఈ చిత్రం మరి ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక నాగ శౌర్య ఇందులో 'గే' పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఇప్పుడు నాగ శౌర్య నర్తనశాలకి, పేపర్ బాయ్ కొద్దిగా కాంపిటీటర్ గానే కనబడుతుంది. సంపత్ నంది టీమ్ వర్క్స్ లో తెరకెక్కిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన పేపర్ బాయ్ మీద కూడా మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రమోషన్స్ లో పీక్స్ లో ఉన్న పేపర్ బాయ్ నర్తనశాల చిన్నగా పోటీ ఇచ్చేలాగా కనబడుతుంది.

Lucky Chance to Paperboy and @Nartanasala:

Advantage to Paperboy, @Nartanasala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs