Advertisement
Google Ads BL

రేష్మి-సుధీర్‌ల అండర్‌స్టాండింగ్‌ సూపర్బ్!


ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే మరో వైపు వెండితెరపై కూడా మెరుస్తూన్న జబర్దస్త్‌ లేడీ రేష్మికి యూత్‌లో ఉన్న క్రేజ్‌ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ తర్వాత హాట్‌ యాంకర్‌గా రేష్మి పేరే ఎవరైనా చెబుతారు. ఇలా యూత్‌ మనసులను దోచేసుకుంటోన్న రేష్మి-సుడిగాలి సుధీర్‌ల మధ్య ఏదో ఉందని అదే పనిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిని వారు ఖండించినా కూడా ఇవి ఆగకపోవడం విశేషం. ఎవరు కనిపించినా రేష్మిని, సుడిగాలి సుధీర్‌ని పెళ్లి చేసుకోండి.. అని , సుడిగాలి సుధీర్‌ని, రేష్మి అయితే మీ బెస్ట్‌ చాయిస్‌ అని మన ప్రేక్షకులు చెప్పి మరి విసిగిస్తుంటారు.  

Advertisement
CJ Advs

తాజాగా రేష్మి సుడిగాలి సుధీర్‌ గురించి మాట్లాడుతూ, ఓ రియాల్టీ షో కోసం నేను సుడిగాలి సుధీర్‌ పెళ్లి చేసుకున్నట్లుగా నటించాల్సివచ్చింది. కానీ చాలా మంది నిజంగానే మా పెళ్లి జరిగిపోయిందని అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒకరోజున నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను. ఇక సుడిగాలి సుధీర్‌ కూడా తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అప్పుడుగానీ ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడదు. కాకపోతే అదెప్పుడు జరుగుతుందో తెలియదు. 

నేను ముందుగా పెళ్లి చేసుకుంటే నేనే సుధీర్‌ని మోసం చేశానని చెప్పుకుంటారు. తనుముందు పెళ్లి చేసుకుంటే తనే నాకు ద్రోహం చేశాడని అంటారు. అందుకే ఒకే ముహుర్తానికి చేరో వేదికపై ఒకేసారి పెళ్లి చేసుకుందామని నేను సుడిగాలి సుధీర్‌కి చెబుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రేష్మి ఐడియా మాత్రం సూపర్‌ అనే చెప్పాలి. 

Anchor Reshmi Opens About Love Affair With Sudigali Sudheer:

Rashmi Latest Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs