Advertisement
Google Ads BL

అనుష్క 'సైలైన్స్‌' అంటోంది!


స్వీటీ అనుష్కకి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలంటే మహా ఇష్టం. అందునా 'అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి' తాజాగా 'భాగమతి' చిత్రాలతో ఈమె హవా కొనసాగుతోంది. అయితే ఈమెకి ఇలాంటి చిత్రాలలోనే 'వర్ణ, సైజ్‌జీరో' వంటి ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. ఇక 'భాగమతి' తర్వాత అనుష్క నటిస్తోందని పలు చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆమె గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనుందని విశ్వసనీయ సమాచారం. 

Advertisement
CJ Advs

హేమంత్‌ మధుకర్‌ విషయానికి వస్తే ఈయన ఆల్‌రెడీ అనుష్కకి స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడని, మరో కీలకపాత్రకు గాను మాధవన్‌ని ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోందని సమాచారం. ఈ చిత్రం కోసం 'సైలెన్స్‌' అనే టైటిల్‌ను కూడా కన్‌ఫర్మ్‌ చేశారట. ఈ ఏడాది మొదటి తెలుగులో హిట్‌గా నిలిచిన 'భాగమతి' చిత్రం రిపబ్లిక్‌డే కానుకగా ఈ ఏడాది జనవరి 26న విడుదలైంది. 

ఇక ఈ తాజా చిత్రాన్ని కూడా దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత జనవరి నెలాఖరులోనే విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ చిత్రంలో స్వీటీ అనుష్క, చాక్లెట్‌బోయ్‌ నుంచి విలక్షణ నటునిగా సత్తా చాటుతున్న మాధవన్‌లు కలిసి ఎలా మరిపించి మురిపిస్తారో వేచిచూడాల్సివుంది...! 

Anushka-Madhavan's Next Film Titled Silence:

Anushka Shetty Silent Romance With Madhavan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs