Advertisement
Google Ads BL

లింగుస్వామి సెంటిమెంట్‌ గమనించారా!


సినీఫీల్డ్‌లో సినిమా హిట్టయిన తర్వాత నిర్మాతలు, హీరోలు ఆయా దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. మహేష్‌బాబు కొరటాల శివకి, మెగాస్టార్‌ చిరంజీవి పరుచూరి బ్రదర్స్‌కి, బండ్లగణేష్‌ ఎన్టీఆర్‌, పూరీజగన్నాథ్‌ వంటి వారికి ఇలా బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే బాలీవుడ్‌, కోలీవుడ్‌లో మరో సంప్రదాయం కూడా ఉంది. సినిమా పూర్తయిన వెంటనే అజిత్‌, విజయ్‌, రజనీకాంత్‌తో పాటు పలువురు స్టార్స్‌ చిత్రానికి పనిచేసిన డైరెక్టర్‌ నుంచి లైట్‌బోయ్‌ వరకు అందరినీ ఆహ్వానించి వారికి పసందైన విందు భోజనం ఇస్తూ ఉంటారు. 

Advertisement
CJ Advs

అదే సమయంలో తీపి గుర్తులుగా తమ యూనిట్‌ సభ్యులందరికీ ఆరోజున ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ఈ సెంటిమెంట్‌ను ఇటీవల కాస్త కెరీర్‌ పరంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్న లింగుస్వామి కూడా పాటించాడు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్‌, మీరాజాస్మిన్‌ జంటగా వచ్చిన 'పందెంకోడి' చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఆచిత్రానికి సీక్వెల్‌గా 'పందెంకోడి 2' రూపొందుతోంది. ఇందులో విశాల్‌ సరసన కీర్తిసురేష్‌ నటిస్తుండగా ఓ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను విశాల్‌ మాజీ ప్రేయసి, నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌ పోషిస్తోంది. 

ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు లింగుస్వామి యూనిట్‌లోని అందరికీ విందు ఇవ్వడమే కాదు... అందరికీ బంగారునాణేలను గిఫ్ట్‌గా ఇచ్చాడట. దీంతో యూనిట్‌ సభ్యులుఎంతో సంతోషంగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న 'పందెంకోడి 2'  చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయాలని భావిస్తున్నారు. 

lingusamy Follows Same Sentiment :

lingusamy Sentiment 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs