Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ చెంపలు పగలగొట్టిన అభయ్!!


ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ చేతిలో దెబ్బలు తినడం ఏమిటా.. అనుకుంటున్నారా.. అరవింద సమేత - వీర రాఘవ సినిమా షూటింగ్ లో విరామం లేకుండా గడుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ చేతిలో పిడి గుద్దులు తిన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ ని ఆఘమేఘాల మీద జరిపేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్... కాస్త సమయం దొరికినా ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు. అందులోను ఇప్పుడు చిన్న కొడుకు భారవి రామ్ తో ఎన్టీఆర్ తెగ ఆడేసుకుంటున్నాడు. మొదటగా అభయ్ రామ్ పుట్టగా.. ఆతర్వాత కూడా ఎన్టీఆర్ అండ్ లక్ష్మి ప్రణతి దంపతులకు మగ పిల్లాడే పుట్టాడు. ఇకపోతే నిన్న సండే సందర్భంగా ఎన్టీఆర్ ఇంట్లోనే తన కొడుకు అభయ్ తో తెగ ఎంజాయ్ చేసాడు

Advertisement
CJ Advs

కొడుకు అభయ్ రామ్ కిచెన్ లో గట్టు మీద కూర్చుని ఉండగా.. ఎన్టీఆర్ కింద కొడుకు ఎదురుగా కూర్చోగా .. అభయ్ రామ్ తన తండ్రి ఎన్టీఆర్ మొహం మీద బాక్సింగ్ చేసేసాడు. రెండు చేతులతో ఎన్టీఆర్ మొహం మీద గుద్దుతూ ఆడేసుకున్నాడు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నా కొడుకు అభయ్ రామ్ పంచింగ్ టైం అంటూ ఎన్టీఆర్ ని అభయ్ కొడుతున్న ఆ ఫన్నీ వీడియో ని పోస్ట్ చేసాడు. మరి పెద్ద స్టార్ అయ్యుండి ఇలా కొడుకు చేతిలో తన్నులు తింటున్నాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

Jr NTR becomes a punching bag:

<span>NTR shared a video in which his son Abhay Ram can be seen punching him ferociously.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs