Advertisement
Google Ads BL

బసవతారకం పాత్ర గురించి మొత్తం చెప్పేసింది


బాలకృష్ణ పైసా వసూల్, జై సింహ వంటి యాక్షన్ చిత్రాల తర్వాత తన తండ్రి మహోన్నత వ్యక్తి అయిన ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ సినిమాని దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎన్టీఆర్ వ్యక్తిగత, నట, రాజకీయ జీవితాల మీద ఉండబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటి భార్య గా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించబోతుంది. విద్యాబాలన్ బసవతారకం పాత్రలో కాస్త నిడివి గల పాత్రే చేస్తుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రని క్రిష్ బాగా హైలెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే ఒక వారం పాటు కీలక సన్నివేశాల్లో పాల్గొన్న విద్యాబాలన్ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కోసం హైదరాబాద్ రానుంది. అయితే బసవతారకం లాంటి పాత్ర తో సౌత్ లోకి రావడం సంతోషకరంగా ఉందని.. ఎన్టీఆర్ బయోపిక్లో నటించడం ఇంకాస్త ఆనందంగా ఉందని చెబుతున్న విద్యాబాలన్.. ఎన్టీఆర్ బయోపిక్ గురించిన చాలా విశేషాలు ముంబై మీడియాతో పంచుకుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్  లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకు సంబంధించిన సమాచారం కొంతే వుందట. అయితే ఆ కాస్త సమాచారానికి కొంత ఊహను జోడించి విద్యా పాత్రను చిత్రీకరిస్తున్నట్టుగా చెబుతుంది విద్యాబాలన్. ఎన్టీఆర్ భార్యగానే బసవతారకం గురించి విని ఉంటారు గాని.. అసలు ఆమె గురించిన విషయాలేమి ఎవరికీ పెద్దగా తెలియదు.

బసవతారకం గారు వ్యక్తిగతంగా ఎవరితోనూ పెద్దగా కలవడం గాని మాట్లాడడం కానీ చెయ్యరు. ఆమె చాలా రేర్ గా బయటికి వచ్చేవారు. అలాగే బసవతారకంగారి గురించి ఎవరూ మాట్లాడిన సందర్భాలు... ఆమె విషయాల్ని జాగ్రత్తగా దాచిన వారు గాని లేరు. ఆమె గృహిణిగా తన బాధ్యతలను నెరవేర్చింది. ఇక నేను బసవతారకం పాత్ర చెయ్యడంతో.. ఎన్టీఆర్‌ కుమార్తెలతో ఒకసారి కలిసి మాట్లాడాను. అయితే ఆమె కూతుళ్లు ఇంట్లో ఆమె ఎలా వుండేవారనే సమాచారాన్ని కొంత చెప్పారు. అందువల్ల నా బసవతారకం పాత్ర కుటుంబ సభ్యుల నుంచి లభించిన సమాచారం మేరకు కొంత… ఊహించి చిత్రీకరించినది మరింత వుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. మరి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనుకుంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ భార్యగా ప్రపంచానికి కొంతమేరె తెలిసిన బసవతారకం పాత్ర గురించే సినిమాలో ఎక్కువ పార్ట్ ఉంటె.. ఎన్టీఆర్ గురించిన చాలా నిజాలు మరుగున పడే అవకాశం ఉంటుంది. మరి బాలకృష్ణ గారు - చంద్ర బాబు.. ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ ని ఎలా ప్లాన్ చేశారో అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే వైసిపి వాళ్ళు సెటైర్స్ వేస్తున్నారు. 

Vidya Balan About Basavatarakam Role in NTR:

Vidya Balan Plays Basavatarakam Role in NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs