Advertisement
Google Ads BL

మహేష్‌, ప్రభాస్‌లు అందుకు సిద్దం!


తెలుగులో చెప్పుకోదగిన వరుస హిట్స్‌ లేకపోయినా కూడా శోభన్‌ అనే దర్శకుడు తన సత్తా ఏమిటో ప్రభాస్‌ కెరీర్‌ని మలుపుతిప్పిన ‘వర్షం’ చిత్రంతో నిరూపించుకున్నాడు. ఆయన మహేష్‌బాబులోని నటుడిని కొత్తకోణంలో ఆవిష్కరిస్తూ ‘బాబి’ చిత్రం తీశాడు. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. మరో వైపు సోదరులైన దర్శకుడు బాబి, లక్ష్మీపతిలు అతి తక్కువ కాల వ్యవధిలోనే మరణించారు. ఇకవిషయానికి వస్తే దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పేరు ‘పేపర్‌బాయ్‌’. జయశంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 31వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో సంతోష్‌శోభన్‌-రియా సుమన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Advertisement
CJ Advs

‘పేపర్‌బాయ్‌’ పట్ల, దాని ప్రమోషన్‌ పట్ల మహేష్‌బాబు, ప్రభాస్‌లు బాగా ఆసక్తిని చూపిస్తున్నారట. ఇందులో హీరోగా నటిస్తున్న సంతోష్‌శోభన్‌ ఎవరో కాదు.. మరణించిన దర్శకుడు శోభన్‌ కుమారుడు. ఇలా శోభన్‌ కుమారుడు హీరోగా నటిస్తున్న ‘పేపర్‌బాయ్‌’ చిత్రానికి మహేష్‌బాబు, ప్రభాస్‌లిద్దరు తమ వంతు సహకారం అందించేందుకురెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు దీనికి ప్రచారం చేస్తే ఈ చిత్రం మరింతగా ప్రేక్షకులకు చేరువ కావడం ఖాయమనే చెప్పాలి. ఇలా తమ స్నేహితుడి రుణాన్ని మహేష్‌, ప్రభాస్‌లు తీర్చుకుంటున్నట్లుగా భావించాలి.

Mahesh and Prabhas Ready to Promote PaperBoy:

Big Stars promote Paperboy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs