ఛలో సినిమాలో నైట్ డ్రెస్సులతోను, చుడీదార్స్ లోను మత్తెక్కించిన రష్మిక మందన్న.. నిన్నగాక మొన్న విడుదలైన గీత గోవిందం సినిమాలోను స్పైసిగా లేకపోయినా చీరకట్టులో చూపు తిప్పుకోలేని అందంతో... కళ్ళతోనే హావ భావాలూ పలికిస్తూ అదరగొట్టింది. ఈగోయిస్టుగా... హీరో విజయ్ దేవరకొండ అంటే అస్సలు కేర్ చెయ్యని అమ్మాయిగా... అతనెన్ని సారీలు చెప్పినా కాస్త కోపం కలగలిసిన పొగరుతో... గీత గోవిందంలో గీత గా అదరగొట్టింది. ఆ సినిమాలో విజయ్ దేవకొండ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ అంటూ రష్మిక వెంట పడడం.. అలాగే విజయ్ గురించిన నిజం తెలిసినప్పుడు బ్యాలెన్సుడ్ గా తన కోపాన్ని కంటిన్యూ చెయ్యడం.. ఇలా అన్ని విషయాల్లో విజయ్ తో పోటీ పడి నటించింది రష్మిక మందన్న.
ఆ సినిమాలో చుడీదార్స్ తోనూ, చీరలలోను రష్మిక అందంగా కనబడింది. విజయ్ దేవరకొండ డ్రీం సాంగ్ లో చీర కట్టులో స్పైసినెస్ తో అదరగొట్టింది. మరి అందాలు ఆరబొయ్యకపోయిన.. మంచి పాత్ర తగిలితే నిరూపించుకోవచ్చు అని రష్మిక గీత గోవిందం సినిమాతో ప్రూవ్ చేసింది. ఇక దేవదాస్ సినిమాలోనూ, విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాల్లోను రష్మిక ఎలా వుండబోతుందో తెలియదు కానీ.. తాజాగా రష్మిక ముగ్ద ఆర్ట్ స్టూడియో ఓపెనింగ్ కి విచ్చేసింది. మరా స్టూడియో ఓపెనింగ్ కి రష్మిక చక్కటి కాంజీవరం పట్టు చీరలో ఎంతో..అందంగా రెడీ అయ్యి అచ్చ తెలుగమ్మాయిలా హాజరైంది. ఆ చీర కట్టులో రష్మికను చూస్తుంటే సింప్లి సూపర్బ్ అనిపించకమానదు.
చక్కటి పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ... బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది రష్మిక. మరి ఈ పిల్లని చూస్తుంటే కన్నడ భామ అనరేమో.. ఎందుకంటే రష్మిక ఆ చీర కట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా వుంది మరి. ఇకపోతే ప్రస్తుతం రష్మిక తన చేతికొస్తున్న అవకాశాలను వదలకుండానే పారితోషకం పెంచిందనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఇక కన్నడ హీరో కమ్ నిర్మాతతో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక పెళ్లి ఊసు మాత్రం తియ్యడం లేదు.