Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండకి ఇంకా కలిసొచ్చిందిగా!


 

Advertisement
CJ Advs

నిన్న శుక్రవారం పొలోమంటూ మూడు నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి క్యూ కట్టాయి. వాటిలో ఆది పినిశెట్టి, తాప్సి, రితిక సింగ్ నటించిన 'నీవెవరో' సినిమా, నారా రోహిత్ - జగపతి బాబు ల 'ఆటగాళ్లు' సినిమా మీదే కాస్తో కూస్తో హైప్ ఉంది. మరి మిగతా సినిమాలు  అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలే అన్నట్టుగా వుంది వ్యవహారం. ఇకపోతే ఆది పినిశెట్టి - తాప్సి - రితిక సింగ్ ల నీవెవరో సినిమాకి ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ వచ్చింది. దర్శకుడు హరనాధ్ నీవెవరో సినిమాని తమిళం నుండి తీసుకుని రీమేక్ చేసాడు. కానీ రీమేక్ చేయడంలో హరినాధ్ పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అసలు ఆకట్టుకోకపోగా... సెకండ్ హాఫ్ మీద కాస్త ఇంట్రెస్ట్ కలిగేంతలోనే అనవసర కామెడీతో సినిమాని చెడగొట్టారు. అంధుడిగా ఆది పినిశెట్టి నటనకు, నెగెటివ్ షేడ్స్ ఉన్న తాప్సి పాత్రకు అలాగే సినిమాటోగ్రఫీకి, నేపధ్య సంగీతానికి ప్లస్ మార్కులు పడగా... కథ, కథనం గొప్పగా లేవని.. డైరెక్షన్ స్కిల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయని.. ఎడిటింగ్ తో పాటుగా మ్యూజిక్ కూడా బాగాలేదని టాక్ వచ్చింది.

ఇక నారా రోహిత్ - జగపతి బాబు కీలక పాత్రల్లో వచ్చిన ఆటగాళ్లు సినిమాని పరుచూరి కిరీటి ఏ మాత్రం ఆసక్తిలేని కథతో తెరకెక్కించి బోర్ కొట్టించాడనే టాక్ వచ్చింది. దాదాపుగా ఆటగాళ్లు సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినట్లే. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. నారా రోహిత్ మరీ లావుగా కనబడడం, నటన బావున్నా లుక్ పరంగా రోహిత్ కి మైనస్ మార్కులు పడుతున్నాయి. ఇక పూర్ డైరెక్షన్, హీరోయిన్ కి అసలు ఇంపార్టెన్స్ లేకపోవడం.. ఇంకా ఈ సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ కనబడుతున్నాయి. దాదాపుగా ఆటగాళ్లు సినిమాకి ప్లాప్ టాక్ వచ్చేసినట్లే. ఇక మిగతా సినిమాల సంగతి సరేసరి.

ఇక గత తొమ్మిది రోజుల క్రితం విడుదలైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల 'గీత గోవిందం' సినిమా మరో ఆరు రోజుల పాటు కుమ్మెయ్యడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ వారం విడుదలైన సినిమాల్లో కంటెంట్ ప్రేక్షకుడు నచ్చినట్లుగా లేకపోవడంతో.. గీత గోవిందం మరో ఆరు రోజులు అంటే నాగ శౌర్య నర్తనశాల వచ్చేవరకు విర్రవీగడం ఖాయంగా కనబడుతుంది. మరి విజయ్ గీత గోవిందం అనుకోని బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్ రావడం... పది రోజులపాటు హిట్ సినిమా లేకపోవడం.. గీత గోవిందానికి కలిసొచ్చింది. మరి తాజాగా ఈ వారం కూడా ఆకట్టుకోలేని సినిమాలతో ఉన్న థియేటర్స్ లో గీత గోవిందం సినిమాకి కలిసొచ్చే అంశం. సో ఆ విధంగా విజయ్ మరింతగా ఈ ఆరు రోజులు రెచ్చిపోయినట్లే.

No Breaks to Vijay Deverakonda :

Fans Disappointed With Aatagallu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs