Advertisement
Google Ads BL

చరణ్‌ బాటలో బన్నీ..!


రామ్‌చరణ్‌ నటించిన రెండో చిత్రమే 'పునర్జన్మల నేపధ్యంలో' సాగే 'మగధీర' చిత్రం ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టి రాజమౌళిలోని సింహం జూలు విదిల్చేలా చేసింది. ఇక విషయానికి వస్తే పునర్జన్మల నేపధ్యంలో తెరకెక్కే చిత్రాలకు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితంలో తేడా కొడుతుంది. గతంలో ఏయన్నార్‌ 'దేవదాసు.. దేవదాసు మళ్లీ పుట్టాడు', నాగార్జున 'జానకిరాముడు' వంటి పలు చిత్రాల ఈ కోవలోకి రూపొంది మంచి ఆదరణ పొందాయి. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులకు ఏమాత్రం అనుమానాలు రాని ఇంటెలిజెంట్‌ స్క్రీన్‌ప్లే కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఇలాంటి ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌గా విక్రమ్‌ కె.కుమార్‌కి ఎంతో పేరుంది. ఆయన తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో చేసిన 'ఇష్క్‌, మనం, 24, హలో' వంటి చిత్రాలు కాస్త సైంటిఫిక్‌గా ఉంటూనే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మరీ ముఖ్యంగా 'మనం' చిత్రం స్క్రీన్‌ప్లే చూస్తే ఆయన బ్రిలియంట్‌ డైరెక్టర్‌ అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. 

Advertisement
CJ Advs

మరోవైపు ప్రస్తుతం మెగా స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ 'నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా' తర్వాత ఎప్పుడు తీసుకోనంత గ్యాప్‌ తీసుకున్నాడు. 'డిజె' చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్‌ అయినా కూడా విమర్శలు రావడం, 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం కమర్షియల్‌గా కూడా ఫ్లాప్‌ కావడంతో ఆయన తన తదుపరి చిత్రం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా విక్రమ్‌ కె.కుమార్‌ చెప్పిన ఓ పునర్జన్మల ఆధారంగా రూపొందిన స్టోరీకి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. తన ప్రతి చిత్రానికి వైవిధ్యం చూపాలని తపించే బన్నీ ఈపాత్ర కోసం, కథ కోసం సరికొత్త మేకోవర్‌తో పాటు పలు జాగ్రత్తలు తీసుకోనున్నాడని సమాచారం. ఈ చిత్రం పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే మరి..!

Allu Arjun Next Movie With Vikram K Kumar:

Allu Arjun Next Movie With Vikram K Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs