Advertisement
Google Ads BL

రాజకీయాలువేరు..సినిమాలు వేరని నిరూపించారు..!


నటిరోజా.. తన కెరీర్‌లో టాప్‌హీరోయిన్‌గా రాణించిన తెలుగమ్మాయి. టిడిపినేత, ఎంపీ శివప్రసాద్‌ వెండితెరకు పరిచయం చేసిన నటి. ఆ తర్వాతికాలంలో దాదాపు అందరు టాప్‌స్టార్స్‌ సరసన నటించింది. మెగాస్టార్‌ చిరంజీవితో 'ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బిగ్‌బాస్‌' చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత టిడిపి పార్టీలో చేరింది. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో చిరంజీవిపై. పవన్‌పై నాడు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనను సినిమాలలో పలువురి పక్కలో పడుతున్న నటిగా విమర్శలు రావడంతో మరి పవన్‌ భార్య రేణుదేశాయ్‌ కూడా సినిమా నటే కదా...! మరి ఆమె ఎందరితో పడుకుంది? అంటూ నెల్లూరులో జరిగిన ఓ సమావేశంలో పచ్చిగా ప్రశ్నించింది. ఆమె మాటలు, వాడే పదజాలం పట్ల ఇప్పటికీ అందరిలో ఎంతో వ్యతిరేకత ఉంది.ఇక ఇటీవల పవన్‌ జనసేనపై కూడా అవాక్కులు చెవాక్కులు పేలింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తాజాగా రాజకీయాలలో విమర్శలకు, వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదని నిరూపించింది. చిరంజీవి 63వ జన్మదినం సందర్భంగా చిరంజీవిని కలసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈమె ప్రస్తుతం మెగాబ్రదర్‌ నాగబాబుతో కలిసి 'జబర్దస్త్‌'లో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 'మా అందరి వాడు చిరంజీవికి జన్మదినశుభాకాంక్షలు' అని విషెష్‌ తెలియజేసింది. చిరంజీవి కూడా ఎంతో గౌరవంగా రోజాను ఆహ్వానించి ఆమెతో కలిసి ఫొటో కూడా దిగాడు. ఈ సందర్భంగా ఆమె మెగాస్టార్‌కి విషెష్‌ అందజేసిన పొటోను వారు షేర్‌ చేశారు. 

మరోవైపు మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా మెగాహీరోలందరు కలిసి హైదరాబాద్‌ శిల్పకళావేదికలో మెగాస్టార్‌ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అల్లుఅరవింద్‌, సునీల్‌, పరుచూరి బ్రదర్స్‌, ఉత్తేజ్‌ వంటి వారు ఈ వేడుకకు తరలి వచ్చారు. చిరు బర్త్‌డే సందర్భంగా విడుదలైన 'సై..రా' టీజర్‌ మరోవైపు సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే. 

Roja Birthday Wishes To Chiranjeevi:

Roja Birthday Wishes To Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs