కమెడియన్ గా చాలా పీక్ స్టేజి లో ఉన్న సునీల్ హీరోయిజం వైపు మొగ్గు చూపాడు. కమెడియన్ గా కన్నా హీరోగానే స్థిరపడాలనుకున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా సునీల్ కి లక్కు ఎంతసేపో నిలవలేదు. వరస వైఫల్యాలతో హీరోగా ఛాన్స్ లు తగ్గిపోయాయి. మళ్ళీ తనకి కలిసొచ్చిన కామెడీనే సునీల్ నమ్ముకుని.. ప్రస్తుతం రెండు బడా సినిమాల్తో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత లో సునీల్ మళ్ళీ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. అలాగే రవితేజ - శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలోనూ సునీల్ కామెడీ పాత్రనే చేస్తున్నాడు.
కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సునీల్ హీరో అవతారమెత్తే ముందు కాల్షీటుకి భారీ పారితోషకం తీసుకునేవాడట. మరి హీరోగా మారాక సినిమాకి ఇంతని ప్యాకేజ్ తీసుకునే సునీల్ మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న సినిమాలకు భారీ పారితోషకానికి పనిచేస్తున్నాడు. మరి ప్రస్తుతం సునీల్ ఒక రోజుకి 3.5 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి అరవింద సమేత లో త్రివిక్రమ్... సునీల్ కోసం గట్టి పాత్రే ఇచ్చి ఉంటాడు. టీజర్ లోనే సునీల్ ని అలా అలా చూపెట్టి సస్పెన్స్ క్రియాట్ చేసాడు. సునీల్ కి ఫ్రెండ్ గనక త్రివిక్రమ్ మంచి పాత్రే అరవిందలో క్రియేట్ చేసుంటాడు.
ఇక శ్రీను వైట్ల సినిమాల్తో సునీల్ కమేడియన్ గా ఒక మెట్టు ఎక్కాడు కాబట్టి ఆయన కూడా సునీల్ కి కామెడీగా మంచి రోల్ అమర్ అక్బర్ ఆంటోనిలో రాసుంటాడు. మరి ఈ రెండు సినిమా ల్లో సునీల్ కామెడీ పేలిందా మళ్ళీ కమెడియన్ గా సునీల్ ఫామ్ లోకొచ్చేస్తాడు. ఎలాగూ హీరో ఆఫర్స్ తగ్గుతున్న క్రమంలో సునీల్ ఇలా కమెడియన్ గా భారీ పారితోషకాన్ని అందుకుంటూ సెటిల్ అయినా అవ్వొచ్చు. కానీ సునీల్ మాత్రం హీరో పాత్రలొస్తే వదలనంటున్నాడు. కానీ హీరో పాత్రలిచ్చే నాథుడు ఉండాలిగా..!